Viral Photo: పూజ గదిలో వొడ్కా బాటిల్‌ .. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటో.. అమ్మలు అంతే అంటున్న నెటిజన్లు

Viral Photo: ఓ మహిళ పూజ గదిలోకి వొడ్కా బాటిల్‌(Vodka Bottle) తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది చూసి ఆ యింట్లో పూజకు వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులంతా... "అపచారం.. అపచారం.. ఇదెక్కడి విడ్డూరమే..

Viral Photo: పూజ గదిలో వొడ్కా బాటిల్‌ .. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటో.. అమ్మలు అంతే అంటున్న నెటిజన్లు
Puja Room

Updated on: Mar 21, 2022 | 10:05 AM

Viral Photo: ఓ మహిళ పూజ గదిలోకి వొడ్కా బాటిల్‌(Vodka Bottle) తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది చూసి ఆ యింట్లో పూజకు వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులంతా… “అపచారం.. అపచారం.. ఇదెక్కడి విడ్డూరమే.. పూజగదిలోకి మద్యం తీసుకొచ్చిందని నోళ్లు నొక్కుకున్నంత పని చేశారు.. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే… అది మద్యం కాదు.. సాధార‌ణంగా కూల్‌ డ్రింక్‌, వాటర్‌ బాటిళ్లను తాగేసిన తర్వాత వాటిని చాలామంది రీ యూజ్‌ చేస్తుంటారు. కానీ.. ఓ మ‌హిళ మాత్రం ఏకంగా తాగేసిన వొడ్కా ఖాళీ బాటిల్‌ను తిరిగి ఎలా వాడిందో తెలిస్తే షాక్ అవుతారు.

ఖాళీ వొడ్కా బాటిల్‌లో దేవుడి దీపారాధనకు వాడే ఆయిల్ పోసి.. పూజ గ‌దిలో పెట్టింది . పూజ కోసం అన్ని ర‌కాల సామాన్లు తీసుకొచ్చి.. వాటి ప‌క్క‌నే దేవుడి ఆరాధ‌న కోసం వాడే ఆయిల్ ఉన్న వొడ్కా బాటిల్‌ను కూడా అక్క‌డ పెట్టింది. ఆ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఆ ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. సాగ‌ర్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఆ ఫోటోను షేర్ చేశాడు. పూజ కోసం మా ఇంటికి బంధువులు వ‌చ్చారు. అదే స‌మ‌యంలో మా అమ్మ వొడ్కా బాటిల్‌లో ఉన్న ఆయిల్‌ను తీసుకొచ్చింది. వొడ్కా బాటిల్‌ను చూసి బంధువులంతా షాక్ అయ్యారు అంటూ ట్వీట్ చేశాడు.

ఆ ట్వీట్‌ను చూసిన నెటిజ‌న్లు.. త‌మ‌దైన శైలిలో స్పందించారు. అవును.. మా అమ్మ కూడా కాబో రమ్ ఖాళీ బాటిల్‌ను రీయూజ్ చేసింది అంటూ మ‌రో నెటిజ‌న్‌ ట్వీట్ చేశాడు. త‌ల్లులు ఎప్పుడూ దేన్నీ వేస్ట్ చేయ‌రు. అన్ని బాటిల్స్‌ను రీయూజ్ చేస్తారు అంటూ మ‌రో నెటిజ‌న్లు ట్వీట్ చేశాడు.

Also Read:

One Rupee Idly, Bonda: గత కొన్నేళ్లుగా ఒక్క రూపాయికే ఇడ్లీ, బొండాలు.. క్వాలిటీ టిఫిన్ కోసం కస్టమర్స్ క్యూ.. ఎక్కడంటే

Viral Video: కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. పగలబడి నవ్విన బంధువులు.. ఫన్నీ వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us