Viral: స్కూల్‌లో చిన్న పిల్లలు టీచర్‌ను ఓ రేంజ్‌లో విసిగిస్తుంటారు. అయినప్పటికీ విసుక్కోకుండా.. పిల్లల అల్లరిని ఆస్వాదిస్తూ, వారిని సరైన క్రమశిక్షణలో ఉండేలా చూస్తారు. సరైన శిక్షణ ఇస్తారు. సాధారణంగానే స్కూల్‌లో పిల్లలకు ఎక్స్‌ట్రా కర్క్యూలర్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయిస్తుంటారు. వీటిలో డ్రాయింగ్, గేమ్స్, సింగింగ్, డ్యాన్సింగ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ తదితరాలు ఉంటాయి. తాజాగా ఓ పాకిస్తానీ టీచర్, స్టూడెంట్స్ మధ్య జరిగిన సరదా ఇన్సిడెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పాకిస్తాన్‌లోని ఓ పాఠశాలలో టీచర్.. తన స్టూడెంట్స్‌కి ఒక టాస్క్ ఇచ్చింది. ఓ విద్యార్థి ఆ టాస్క్‌ను కంప్లీట్ చేశాడు. అది చూసి ఆ టీచర్ సైతం ఆశ్చర్యపోయింది. అవును, టీచర్ నిషాత్.. ఫస్ట్ క్లాస్‌కు చెందిన ఓ చిన్నారిని తన బొమ్మ గీయని కోరింది. దాంతో ఆ చిన్నారి నిషాత్ చిత్రాన్ని పెన్సిల్‌తో తన నోట్‌బుక్ గీసింది. బొమ్మ కింద నిషాత్ మేడం అని క్యాప్షన్ కూడా పెట్టింది. టాస్క్ కంప్లీట్ అయిన తరువాత డ్రాయింగ్‌ను టీచర్ నిషాత్‌కు చూపించింది. అది చూసి తొలుత షాక్ అయిన నిషాత్.. ఆ తరువాత నవ్వుకుంది. చిన్నారి గీసిన తన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. నిజంగా నేను ఇలాగే ఉన్నానా? అంటూ ఫన్నీ క్యాప్షన్ పెట్టింది నిషాత్.
స్టూడెంట్ గీసిన ఈ డ్రాయింగ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ ఫోటోను చూసి నవ్వుకుంటున్నారు. చిన్నారి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ ఫోటోకు రేటింగ్స్ ఇస్తున్నారు నెటిజన్లు. కొందరు 08/10 రేటింగ్స్ ఇచ్చారు. చాన్నిరి వేసిన ఈ డ్రాయింగ్ తమనుకు బాగా ఆకట్టుకుంటుందని ఇంకొందరు కామెంట్ పెట్టారు. మరెందుకు ఆలస్యం.. ఈ బ్యూటిఫుల్ డ్రాయింగ్‌ను మీరూ చూసేయండి.
Asked first graders to draw a picture of me. The results were hilarious. Here’s a reference picture of how I looked: pic.twitter.com/vhC6bwXIf7
— Nishat (@Nishat64) September 15, 2022
Due to high number of requests I am sharing some more works of art. This one’s pretty minimal, very modern. So I’ll rate it a 6.5/10 pic.twitter.com/lZKoTRSaB2
— Nishat (@Nishat64) September 16, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..