Viral News: సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ఏంటి…? హర్రర్‌ సినిమా చూస్తుండగా అనూహ్య ఘటన…

70 MM థియేటర్‌లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. పెద్ద స్క్రీన్‌పై అభిమాన హీరోల యాక్షన్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ను తనివితీరా చూస్తే తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇక హర్రర్‌ సినిమా చూడాలంటే చిన్న స్క్రీన్స్‌ మీద మజానే ఉండదు. పెద్ద స్క్రీన్స్‌మీద భయంకరమైన సీన్స్‌ చూసి తీరాల్సిందే. అదో అద్భుతమైన, ఉత్కంఠభరితమైన అనుభవాన్ని...

Viral News: సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ఏంటి...? హర్రర్‌ సినిమా చూస్తుండగా అనూహ్య ఘటన...
Theatre Collapse

Updated on: May 26, 2025 | 2:28 PM

70 MM థియేటర్‌లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. పెద్ద స్క్రీన్‌పై అభిమాన హీరోల యాక్షన్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ను తనివితీరా చూస్తే తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇక హర్రర్‌ సినిమా చూడాలంటే చిన్న స్క్రీన్స్‌ మీద మజానే ఉండదు. పెద్ద స్క్రీన్స్‌మీద భయంకరమైన సీన్స్‌ చూసి తీరాల్సిందే. అదో అద్భుతమైన, ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇస్తుంది, కానీ అర్జెంటీనాలో ఒక మహిళకు షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. థియేటర్‌లో హర్రర్‌ సినిమా చూస్తుండగా అది భయటికొచ్చింది. ఫైనల్ డెస్టినేషన్ సినిమాను చూస్తూ హర్రర్‌ సీన్లలో మునిగిపోయింది. ఇంతలో జరిగిన అనూహ్య సంఘటను ఒక్కసారిగా షాక్‌కు గురయింది. సినిమాలోని హర్రర్‌ నిజ జీవితలో జరిగినట్లుగా అనిపించిందని ఆ మహిళ వణికిపోయింది.

సోమవారం అర్జెంటీనాలోని లా ప్లాటాలోని సినిమా ఓచో థియేటర్‌లో ఈ సంఘటన జరిగింది. సినిమాలో ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌కు చేరుకుంటుండగా, సినిమా హాల్ పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. కింద ఉన్న సీట్ల మీద అమాంతం పడిపోయింది. ఈ ఘటనలో ప్రేక్షకుడికి గాయాలయ్యాయి. ఫియమ్మ విల్లావర్డేగా గుర్తించబడిన ఆ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెను, వారి స్నేహితుడితో కలిసి థియేటర్‌కు వెళ్ళింది. సినిమా ప్రారంభమైన కాసేపటికే థియేటర్‌ పైకప్పు కూలిపోయింది.

సినిమాలోని ఉత్కంఠభరితమైన, బిగ్గరగా ఉండే సౌండ్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు పైకప్పు కూలిపోయింది అయితే అయితే ఉరుములాంటి శబ్దం అంతా కొనసాగుతున్న సన్నివేశం నుండే వచ్చిందని అంతా భావించారు. “మొదట, మేము సినిమాలో చాలా మునిగిపోయాము కాబట్టి ఇది సినిమాలో భాగమని అనుకున్నాము” అని ఫియామ్మ తెలిపింది. కానీ తరువాత ఒక పెద్ద ముక్క తనపై పడటంతో సినిమా కాదు రియల్‌గా జరిగిందనే విషయం తెలిసిందని ఆమె చెప్పుకొచ్చింది.

పైకప్పు నుండి ఒక ప్యానెల్ ఆమె మోకాలికి తగిలింది, దీని వలన వెంటనే వైద్య సహాయం అవసరమయ్యే గాయం అయింది. ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సినిమా అనుభవానికి అంతరాయం కలిగించడమే కాకుండా ఫియమ్మ ఉద్యోగ జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. గాయం కారణంగా ఆమె స్థానిక బార్‌లో తన ఉద్యోగం నుండి సెలవు తీసుకోవలసి వచ్చింది. ఈ ఘటనపై న్యాయవాదిని సంప్రదించినట్లు ఆమె చెప్పింది.

సినిమా హాల్ దుర్ఘటన దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించడంతో, నెటిజన్లు “భయానక అనుభవం ఇప్పుడే నిజమైంది” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “ఆమెకు పూర్తి అనుభవం వచ్చింది” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “ఫైనల్ డెస్టినేషన్ చూస్తున్నప్పుడు ఫైనల్ డెస్టినేషన్ క్షణం పూర్తిగా పిచ్చిగా ఉంది” అని మరొకరు జోడించారు.