
ప్రస్తుతం పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది వన్యప్రాణుల సంరక్షణకారులు షేర్ చేసిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మిలియన్ల వ్యూస్‌ని సంపాదిస్తున్నాయి. ఇటీవల, ఒక వన్యప్రాణుల సంరక్షణాధికారి షేర్ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా ప్రమాదకరమైన దృశ్యం కనిపించింది. ఒక చిన్న గుడిపై పడుకున్న నాగుపాము బుసలు కొడుతూ ఆ గుడికి కాపలాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాతి గుడిపై దాని పడగను పైకి లేపి బుసలు కొడుతూ ఉండటం మీరు కూడా చూడవచ్చు. సాధారణంగా దేవాలయాలలో ఇలాంటి పాములను చూడటం చాలా అరుదు.
ఈ వీడియో చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆలయంపై ఉన్న పాము చాలా శక్తివంతమైనదని, కొన్ని ప్రత్యేక శక్తులను కలిగి ఉందని చెబుతున్నారు. మరికొందరు పాము ప్రమాదాన్ని గ్రహించి ముందుజాగ్రత్తగా బుసలు కొడుతోందని సూచిస్తున్నారు.
ఈ వైరల్ వీడియోను సర్పెంట్ షార్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు, 62,000 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూశారు. మొత్తంమీద.. ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేసేలా ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..