Viral Video: సూది, ఇంజక్షన్ అనే పేరు చెప్పగానే కొందరు దెయ్యం చూసినట్లు చూస్తూ.. భయంతో గంతులు వేస్తారు. మరికొందరు ఏడుస్తారు.. ఇలాంటి సన్నివేశాలను మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఓ వీడియో డాక్టర్ చిన్నారికి ఇంజెక్షన్ చేసే విధానం.. వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ డాక్టర్ కు అభిమాని అవుతారు. వాస్తవానికి వైరల్ క్లిప్‌లో.. వైద్యుడు 6 నెలల చిన్నారికి ఇంజెక్షన్‌ను ఇంజెక్ట్ చేశాడు. ఆ పిల్లవాడు ఏడవకుండా, చిరునవ్వులు చిందుస్తున్న ముఖం అలాగే ఉంది. ఇది నిజమా అని మీరు నమ్మక పోతే.. ఇప్పుడు ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..
చిన్న పిల్లలకు సంబంధించిన అందమైన వీడియోలు తరచుగా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి. తాజా వీడియో ఒక వైద్యుడిది. ఈ వీడియోలో అతను పిల్లలకు ఇంజెక్షన్ చేసే శైలిని చూసి మీ హృదయం సంతోషిస్తుంది. చిన్నారిని ఆటల్లో పెట్టి.. డాక్టర్ ఎలా ఇంజెక్షన్ చేశాడో కొన్ని సెకన్ల ఈ వీడియోలో చూడొచ్చు. తమాషా ఏమిటంటే.. ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు, డాక్టర్ పిల్లవాడికి సూది శరీరంలోకి గుచ్చుతున్నప్పుడు.. వచ్చే నొప్పి సమయంలో కూడా చిన్నారి బాలుడు నవ్వుతూనే ఉంటాడు. ఈ సమయంలో పిల్లల తండ్రి వ్యక్తం చేసిన ఫీలింగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.
డాక్టర్ వీడియోను ఇక్కడ చూడండి:
This doctor loves his job pic.twitter.com/5cggviV6aa
— Vala Afshar (@ValaAfshar) September 18, 2022
ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వైద్యుడు అతని వృత్తిని ఇష్టపడతాడు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల మంది చూశారు. లక్షా 30 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియో ను ప్రజలు దీనిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. అదే సమయంలో వేలాది మంది దీనిపై కామెంట్ చేస్తున్నారు.
ఈ కాలంలో ఇలాంటి డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను అని ఒకరు వ్యాఖ్యానిస్తే.. మరొకరు.. ఈ డాక్టర్ వైద్యం చేసే విధానం బాగుంది అని వ్యాఖ్యానించారు. పిల్లవాడికి సూది ఇచ్చినా.. బాలుడు ఏడవలేదు. నిజంగా ఈ వీడియో అద్భుతం అని అంటే.. మొత్తానికి ఈ డాక్టర్ నెటిజన్ల మనసు దోచుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..