Watch: మీరేనా..? మేము కూడా బీచ్‌కు వస్తాం.. ఈదుతాం..! ఇదో హఠాత్పరిణామం..

|

Jun 15, 2023 | 2:13 PM

ప్రజలంతా బీచ్‌లో ఆనందంగా ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తుండగా, వారికి ఒక ఆశ్చర్యకర సంఘటన ఎదురైంది. ఎందుకంటే ఆ బీచ్‌లో మనుషులే కాదు, ఓ నల్లటి ఆకారం కనిపించింది. ఇది చూసి బీచ్‌లో విహరిస్తున్న పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. షాక్ అవుతూనే ఆనందంగా ఆ దృశ్యాన్ని ఆస్వాదించారు.

Watch: మీరేనా..? మేము కూడా బీచ్‌కు వస్తాం.. ఈదుతాం..!  ఇదో హఠాత్పరిణామం..
Black Bear Swimming
Follow us on

సోషల్ మీడియా అంటేనే వింతలు, విచిత్రాల సమాహారం. ఇక్కడ అనేక ఫన్నీ వీడియోలు, ఆశ్చర్యకర సంఘటనలు, షాకింగ్‌ దృశ్యాలు కనిపిస్తాయి. అలాంటివి ప్రతి నిత్యం వందల వేల వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ అవుతుంటాయి. అలాంటిదే ఇక్కడ మరో వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌ అవుతూనే, ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రజల మధ్యలో బీచ్‌లో ఎలుగుబంటి ఎంజాయ్‌ చేస్తున్న సీన్‌ కనిపించింది. ప్రజలంతా బీచ్‌లో ఆనందంగా ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తుండగా, వారికి ఒక ఆశ్చర్యకర సంఘటన ఎదురైంది. ఎందుకంటే ఆ బీచ్‌లో మనుషులే కాదు, ఓ నల్లటి ఎలుగుబంటి కూడా స్విమ్‌ చేస్తోంది. వామ్మో ఇలాంటి ఆ క్షణాన్ని ఊహించుకోండి… మీరు బీచ్‌లో ఈత కొడుతుండగా, హఠాత్తుగా ఎలుగుబంటి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఇంకేముంది.. బతుకు జీవుడా అనుకుంటూ భయంతో పారిపోవాల్సిందే. ఫ్లోరిడా బీచ్‌లలో ప్రజలు అక్షరాలా అదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్లోరిడా ఎలుగుబంట్లు, మొసళ్లకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ సన్నివేశాలన్నీ మనల్ని నవ్విస్తాయి. ఇది కూడా అలాంటి సన్నివేశమే. ఫ్లోరిడాలోని డెస్టిన్‌లోని బీచ్‌లో చాలా మంది స్మిమ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతలో అక్కడ ఒక ఎలుగుబంటి కనిపించింది. ఇది చూసి బీచ్‌లో విహరిస్తున్న పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. పెన్సకోలా నివాసి జెన్నిఫర్ మేజర్స్ స్మిత్ తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో ఎలుగుబంటి ఈదుకుంటూ అక్కడి నుంచి ఒడ్డుకు పరుగెత్తుకుంటూ సురక్షితంగా ముందుకు సాగుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. అక్కడున్న వారు కూడా ఎలుగుబంటిని సంతోషపడుతూనే, షాకింగ్‌గా చూస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన జెన్నిఫర్ మేజర్స్ స్మిత్, అలాంటి దృశ్యాన్ని తాను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఊహించినట్లుగానే ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా వీక్షణలను సంపాదించింది. దీంతో చాలా మంది షాక్ అవుతున్నారు. చాలామంది ఇలాంటి దృశ్యాన్ని మొదటిసారి చూశామంటూ స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..