ఫన్‌తో పాటు మేధాశక్తిని పెంపొందించే ఫోటో పజిల్స్ అందరికీ ఇష్టమే. సాధారణంగా యువత వీకెండ్ బుక్స్‌లో వచ్చే పద సంపత్తిని, పజిల్స్‌ను సాల్వ్ చేసే దాకా వదిలిపెట్టరు. అలాంటిది ఫోటో పజిల్స్ విషయానికొస్తే.. తగ్గేదేలే అన్నట్లుగా వాటిని ఓ పట్టు పడతారు. అయితే ఈ ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే.. మేధాశక్తితో పాటు మీ కళ్లల్లోనూ పదునుండాలి. ఇవి కొన్నిసార్లు మేధావులను కూడా తప్పటడుగులు వేసేలా చేస్తాయి. పైకి కనిపించేది ఒకటైతే.. అసలైంది వేరే ఉంటుంది. కాబట్టి మీ కళ్లకు పదునుంటే.. ఫోటో పజిల్స్ ఈజీగా సాల్వ్ చేసేయగలం. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కంటూ ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేయండి మరి.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అది కరెక్ట్‌గా ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఏదో పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగిన ప్రాంతంలా ఉంది కదూ.. అవునండీ..! మీరు అనుకునేది కరెక్టే.. అక్కడే ఓ చిన్న విషసర్పం నక్కి ఉంది. అది ఎక్కడుందో ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు. మీరైనా ట్రై చేయండి. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేక చేతులెత్తేశారు. కొంతమంది అయితే.. అందులో పామూ లేదు.. ఏమి లేదు.. అంతా మీ భ్రమ అంటూ కామెంట్స్ చేశారు. మరి మీరేమంటారు. ఈ ఫోటో పజిల్‌ను ‘telugufunworld’ అనే ట్విట్టర్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. కొన్ని గంటల్లోనే ఇది నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
here is the answer.. pic.twitter.com/DYXpy3P8Mf
— telugufunworld (@telugufunworld) March 1, 2022