ఇవేం పనులు సార్‌.. స్కూల్‌ను బార్‌ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు! ఏకంగా క్లాస్‌ రూమ్‌లోనే సిట్టింగ్‌

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తరగతి గదిలో మద్యం సేవించిన వీడియో వైరల్‌గా మారింది. గ్రామస్తులు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన విద్యారంగంలో తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఇవేం పనులు సార్‌.. స్కూల్‌ను బార్‌ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు! ఏకంగా క్లాస్‌ రూమ్‌లోనే సిట్టింగ్‌
Teacher

Updated on: May 14, 2025 | 12:41 PM

పిల్లలకు విద్యాబుద్ధలు నేర్పించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు అది పక్కనపెట్టి ఏకంగా క్లాస్‌ రూమ్‌లోనే సిట్టింగ్‌ వేశారు. దర్జాగా బార్‌లో కూర్చోని తాగుతున్నట్లు క్లాస్‌ రూమ్‌లో మందు పార్టీ చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన ఈ ఘన కార్యం ఏకంగా వీడియో రూపంలో బయటికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తరగతి గదిలోనే మద్యం సేవిస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. హసన్‌పూర్ బ్లాక్ పరిధిలోని ఫయాజ్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.

గ్రామస్తుల కథనం ప్రకారం, సుతారి గ్రామంలోని సమీపంలోని పాఠశాలకు చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరవింద్ కుమార్, మరొక ప్రధానోపాధ్యాయుడు అనుపాల్, రోజూ పాఠశాల ఆవరణలో పిల్లల ముందు మద్యం సేవించేవారని ఆరోపించారు. ఒక రోజు వారిద్దరు తరగతి గదిలో మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు వీడియో తీసి జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించారు. ప్రాథమిక విచారణ తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ నిధి గుప్తా వాట్స్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన ఈ వీడియోలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో తరగతి గదిలోని టేబుల్‌పై మద్యం పోసి సేవిస్తున్నట్లు చూడవచ్చు. బ్లాక్ విద్యా అధికారి ఈ విషయంపై దర్యాప్తు చేసి, దర్యాప్తు నివేదిక ఆధారంగా ఇద్దరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి