Watch Video: నాతోనే పరాచకాలా.. పక్కింట్లో దూరిన పామును పట్టుకునేందుకు వెళ్లాడు.. కట్‌చేస్తే..

పాము పేరు వింటేనే చాలా మంది భయపడుతారు. అదే పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. అక్కడ కనిపించకుండా పరుగులు తీస్తాం.. మళ్లీ ఆ దరిదాపుల్లోకి కూడా రావాలనుకోము. కానీ ఇక్కడో యువకుడు మాత్రం పక్కింట్లో పాము దూరిందని తెలియగానే.. వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని గబుక్కున పట్టేశాడు. కానీ చవరకు ఆ పాము కాటుకే బయలయ్యాడు.

Watch Video: నాతోనే పరాచకాలా.. పక్కింట్లో దూరిన పామును పట్టుకునేందుకు వెళ్లాడు.. కట్‌చేస్తే..
Snkae Viral Video

Updated on: Sep 22, 2025 | 2:22 PM

పక్కింట్లో దూరిన పామును పట్టుకునేందుకు వెళ్లిన ఒక యువకుడు ఆ పాము కాటుకే మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌ జిల్లాలోని భోపా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న మోర్నా గ్రామంలో నివసిస్తున్న 24 ఏళ్ల యువకుడు మోహిత్‌కు తన పక్కింట్లో పాము దూరిందనే విషయం తెలిసింది. దీంతో మోహిత్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. పాము ఎక్కడుందని వెతికి ఎంతో చాకచక్యంగా దానిని పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును పట్టుకొని మెడలో వేసుకొని వీడియో చిత్రీకరించాడు.

అయితే వీడియో తీసిన తర్వాత పామును మెడలోంచి తీయబోతుండగా అది ఒక్కసారిగా మోహిత్‌ను కాటేసింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.