మహిళ హ్యాండ్‌బ్యాగ్‌పై అనుమానం.. ఓపెన్‌ చేసిన చూడగా ఖాకీలకే ఊహించని ఝలక్‌..!

|

Jan 22, 2025 | 9:32 PM

ఇక్కడ ఒక మహిళ బ్యాగ్‌ని చూసిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. ఆ వెంటనే సదరు మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఆమె ఉపయోగించిన బ్యాగ్‌పై ఎవరూ ఎక్కడ చూడని విధంగా వింతగా కొన్ని అక్షరాలు రాసి ఉండటం గమనించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.. ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఖాకీలకే మైండ్‌ బ్లాంక్‌ అయినంత పనైంది. ఆ బ్యాగ్‌ తెరిచి చూసిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

మహిళ హ్యాండ్‌బ్యాగ్‌పై అనుమానం.. ఓపెన్‌ చేసిన చూడగా ఖాకీలకే ఊహించని ఝలక్‌..!
A Bag Full Of Drugs
Follow us on

అమెరికా నుంచి ఓ ఆసక్తికర కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ బ్యాగ్‌ని చూసిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. ఆ వెంటనే సదరు మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఆమె ఉపయోగించిన బ్యాగ్‌పై ఎవరూ ఎక్కడ చూడని విధంగా వింతగా కొన్ని అక్షరాలు రాసి ఉండటం గమనించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.. ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఖాకీలకే మైండ్‌ బ్లాంక్‌ అయినంత పనైంది. ఆ బ్యాగ్‌ తెరిచి చూసిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె బ్యాక్‌ప్యాక్‌లో మెథాంఫేటమిన్, డ్రగ్ సామాగ్రిని గుర్తించిన పోలీసులు సదరు మహిళను అరెస్టు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. డ్రగ్స్ రికవరీ చేసిన బ్యాగుపై.. విచిత్రంగా ఇలా రాసి ఉంది.. అసలు ఈ బ్యాగ్‌లో ఎలాంటి డ్రగ్స్ లేవని రాసి ఉంది. రోడ్డుపై పార్క్ చేసిన కారును పోలీసులు సోదా చేయగా అందులో మహిళతో పాటు డ్రగ్స్‌, కొన్ని రకాల ఇంజెక్షన్లు, డిజిటల్ స్కేల్స్, ఇతర మత్తుపదార్థాలు ఉండడంతో షాక్ తిన్నారు. కానీ, బ్యాగ్‌పై రాసి ఉన్న లైన్ చదివి అందరూ ఆశ్చర్యపోయారు.

అది చూసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న దానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. అందులో డ్రగ్స్ లేవని రాసి ఉన్న బ్యాగులో డ్రగ్స్ నింపి కనిపించడం. అయితే, జనవరి 18న ఆమెను అరెస్టు చేసిన తర్వాత, మహిళను రూ.13 లక్షల బాండ్‌పై విడుదల చేసినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..