Viral Video: వ్యర్ధాలకు అర్ధాన్ని కల్పిస్తున్న మహిళలు.. మొక్కజొన్న తొక్కలతో అందమైన పువ్వుల తయారీ.. వీడియో వైరల్

కాదేదీ కళకు కనర్హం.. చెత్త అనుకున్న వాటితో కూడా కళాకాండలు సృష్టించవచ్చు అని అనేక మంది నిరుపిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక మహిళ మొక్కజొన్న పొత్తు తొక్కలకు ప్రాణం పోసింది. తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అందమైన పుష్పగుచ్ఛాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మహిళలు మొక్కజొన్న పొట్టుతో పుష్పగుచ్ఛాన్ని తయారు చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇలా కూడా చేయవచ్చా అంటూ ఆలోచించడం ప్రారంభించారు.

Viral Video: వ్యర్ధాలకు అర్ధాన్ని కల్పిస్తున్న మహిళలు.. మొక్కజొన్న తొక్కలతో అందమైన పువ్వుల తయారీ.. వీడియో వైరల్
Corn Husk Craft

Updated on: Jul 15, 2025 | 1:10 PM

మన దేశంలో ప్రతిభకు కొరత లేదు. కావాల్సింది ప్రతిభకు తగిన ప్రోత్సాహమే.. తమ ప్రతిభతో పనికిరాని వాటికి ప్రాణం పోసి వాటిని ఉపయోగకరంగా మార్చే కళాకారులకు కొదవు లేదు. కొంత మంది వ్యక్తుల కళ సోషల్ మీడియాలో ప్రజల ముందుకు వచ్చినప్పుడు, అందరూ ఆశ్చర్యపోతారు. అలాంటి కళాకృతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రజలలో చర్చలోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన తర్వాత ఇలా కూడా చేయవచ్చా అని అందరూ ఆలోచించడం ప్రారంభించారు. అంతేకాదు ఇలాంటి కళ మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడం ప్రారంభించారు.

మొక్కజొన్న తినడానికి ముందు దాని మీద ఉన్న తొక్కని తీసి పక్కకు పడేస్తారు. ఎందుకంటే ఈ తొక్క ఉపయోగపడదని అనుకుంటారు. అయితే పనికి రాదంటూ పడేస్తున్న మొక్కజొన్న పొత్తు తొక్కలకు అందమైన రూపాన్ని ఇవ్వచ్చు అని… హస్తకళలు లేదా చేనేత వస్త్రాలు తయారు చేయడాని ఉపయోగించవచ్చని మీకు తెలుసా. ఇప్పుడుసోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో మహిళల బృందం మొక్కజొన్న తొక్కలతో అందమైన పుష్పగుచ్ఛాలు తయారు చేస్తున్నారు. దీన్ని చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో, కొంతమంది మహిళలు ఈ తొక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని పువ్వు ఆకారంలోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే అమ్మాయిలతో పాటు వృద్ధ మహిళలు కూడా ఈ పనిలో పాల్గొంటున్నారు. ఈ వీడియో మహిళా సాధికారత సందేశాన్ని కూడా అందిస్తోంది. మీలో సృజనాత్మకత ఉంటే పనికిరాని వస్తువులకు కూడా ప్రాణం పోయవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో సజీవ సాక్షంగా నిలుస్తుంది.

ఈ వీడియోను @phooljafoundation అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. వేలాది మంది లైక్‌ల ద్వారా ప్రేమను కురిపిస్తున్నారు. మహిళల కళను ప్రశంసిస్తున్నారు. ఒకరు ఈ కళ నిజంగా ప్రశంసించదగినదని రాశారు. మరొకరు ఈ మహిళలను, వారి కళను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని కామెంట్ చేశారు. మరొకరు వీరి పతిభను చూసేందుకు సరదాగా ఉందని రాశారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..