
కళ్ళు చెదిరే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పెద్ద చేపను వేటాడింది. దాన్ని మోసుకెళ్లడానికి చాలా కష్టపడింది. తోటి పక్షుల నుంచి వేటను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం.. ఈ అద్భుతమైన దృశ్యం చూసిన వాళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
సాధారణంగా డేగలు వేటాడే తీరును అంతగా మనం చూడలేము. కానీ, ఈ మధ్య కాలంలో కళ్ళు తిప్పుకోనివ్వని వేట వీడియోలు చాలా బయటపడుతున్నాయి. “డేగ చూపు” అని అంటారు కదా, అది నూటికి నూరు శాతం నిజమని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. చేపలను డేగలు వేటాడే దృశ్యాలు ఎన్ని చూసినా, మళ్ళీ మళ్ళీ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి.
వీడియో చూడండి..
ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో, డేగ ఒక భారీ చేపను పట్టుకుంది. అయితే, ఆ చేప చాలా పెద్దది కావడంతో, నీటిలోంచి వెంటనే పైకి ఎగరలేకపోయింది. చేప ఈ డేగను రెండు మూడు సార్లు నీటిలోకి లాగింది. అయినా సరే, తన పట్టు వదల్లేదు. చివరికి, కలుగు తన ఒక కాలుతో ఆ చేపను బలంగా పట్టుకుని, తేలికగా గాలిలోకి ఎగిరింది. చేపను పట్టుకుని అలా ఎగరడం, దాన్ని పైకి తీసుకెళ్లడం చూసిన వాళ్ళను అవాక్కయ్యేలా చేసింది. ఈ దృశ్యం డేగల శక్తిని, నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఆ తర్వాత, ఆ చేపతో హాయిగా విశ్రాంతి తీసుకోవడం కూడా చూడముచ్చటగా ఉంది.