Zelensky : భార్యతో ఉక్రెయిన్ అధ్యక్షుడి ఫొటో షూట్‌.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ఫైర్‌..

|

Jul 27, 2022 | 9:01 PM

అయితే, 4 నెలల యుద్ధం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వివాదంలో చిక్కుకున్నారు. అందుకు కారణం.. అతను తన భార్య, ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కాతో కలిసి ఫోటో షూట్ చేయడమే..

Zelensky : భార్యతో ఉక్రెయిన్ అధ్యక్షుడి ఫొటో షూట్‌.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ఫైర్‌..
Zelensky
Follow us on

Zelensky :  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన యుద్ధం కారణంగా ఉక్రెయిన్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఫిబ్రవరి 24న, పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక దాడులను ప్రారంభించాడు… ఫలితంగా, ప్రజలు పెద్ద సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారు. యుద్ధ పరిస్థితిని పరిశీలించడానికి మరియు ప్రజల్ని రక్షించడానికి యుద్ధం రంగంలోకి దిగి హీరోగా నిలిచారు. అతని వీరోచిత వ్యూహాలు విజయవంతమయ్యాయి. అయితే, 4 నెలల యుద్ధం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వివాదంలో చిక్కుకున్నారు. అందుకు కారణం.. అతను తన భార్య, ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కాతో కలిసి ఫోటో షూట్ చేయడమే.. ఆన్‌లైన్‌లో ఆ ఫోటోలు తీవ్రంగా వైరల్ అయ్యాయి. 4 నెలల యుద్ధం తర్వాత, Zelenskyy ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్రూరంగా ట్రోల్ చేయబడుతున్నారు.

ప్రఖ్యాత వోగ్‌ మ్యాగజైన్‌ పత్రికకు ఒలెనా జెలెన్‌స్కా ఇటీవల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకోసం జెలెన్‌స్కీ, ఆయన సతీమణి ఇద్దరూ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష భవనంలో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫొటోకు పోజిచ్చారు. ఈ జంట టేబుల్‌కి అడ్డంగా చేతులు పట్టుకుని పోజులిచ్చారు. ఆలింగనం చేసుకునే ఫోజులు కూడా ఇచ్చారు.

ఇక ఉక్రెయిన్‌లోని సంఘర్షణ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒలెనా యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఫొటో దిగారు.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ఛాయాచిత్రాలను తీశారు. వాటిని ఒలెనా జెలెన్స్కా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి పంచుకున్నారు. అయితే, ఈ ఫొటోలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వీరిని సమర్థిస్తుండగా.. చాలా మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దేశంపై రష్యా బాంబులు జారవిడుస్తుంటే జెలెన్‌స్కీ ఇలాంటి ఫొటోషూట్‌లో పాల్గొనడమేంటని ప్రశ్నిస్తున్నారు.