
ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్ నుంచి బంగారు టాయిలెట్ కమోడ్ చోరీ ఘటన అందరికీ తెలిసిందే. దాదాపు 300 ఏళ్ల నాటి ఈ కమోడ్ విలువ 48,00000 పౌండ్లు (సుమారు రూ. 50.36 కోట్లు) ఉంటుంది. బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. సెప్టెంబర్ 2019లో ప్యాలెస్‌లో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో దీనిని కొట్టేసినట్టు తెలిపాడు. దోపిడీ ముఠాలో సభ్యుడిగా ఉన్న 37 ఏళ్ల UK జాతీయుడు ఫ్రెడరిక్ డో శిక్షను UK కోర్టు ఇప్పుడు తగ్గించింది. గతంలో అతని 21 నెలల జైలు శిక్షను తగ్గించిన కోర్టు, ఇప్పుడు జీతం లేకుండా 240 గంటలు పని చేయాలని ఆదేశించింది.
సెప్టెంబర్ 2019లో బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో జరిగిన ప్రదర్శనలో ‘అమెరికా’ అనే బంగారు టాయిలెట్ హైలైట్‌గా నిలిచింది. దీనిని ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ రూపొందించారు. ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. దాదాపు 98 కిలోగ్రాముల (216 పౌండ్లు) బరువు కలిగి ఉంది. ఇందులో దాదాపు 20 కిలోల బంగారం ఉపయోగించారు. దీని విలువ దాదాపు రూ.28 కోట్లు.
ఫ్రెడరిక్ తో పాటు, పోలీసులు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు మైఖేల్ జాన్సన్, జేమ్స్ షీన్. ఇప్పుడు ఫ్రెడరిక్ జైలు శిక్ష రద్దు చేయబడింది. ఫ్రెడరిక్ దొంగతనంలో కేవలం మధ్యవర్తి అని కోర్టు కనుగొంది. విచారణ సమయంలో దొంగలు సెప్టెంబర్‌లో దొంగిలించబడిన టాయిలెట్ నుండి దాదాపు 20 కిలోల బంగారాన్ని బర్మింగ్‌హామ్‌లోని ఒక ఆభరణాల దుకాణంలో విక్రయించారని వెల్లడైంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..