Viral Video: రామ చిలుక స్నానం చేయడం ఎప్పుడైనా చూశారా?.. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!

Viral Video: మానవ మేధస్సుకు, ఇతర జీవుల మేధస్సుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం మనుషులు, ఇతర జీవులు అన్నీ సమానంగానే..

Viral Video: రామ చిలుక స్నానం చేయడం ఎప్పుడైనా చూశారా?.. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!
Parrot

Updated on: Mar 09, 2022 | 7:00 AM

Viral Video: మానవ మేధస్సుకు, ఇతర జీవుల మేధస్సుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం మనుషులు, ఇతర జీవులు అన్నీ సమానంగానే ప్రవర్తించడం చూస్తుంటాం. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండటం కోసం ప్రతి రోజూ స్నానం చేస్తుంటాం. దుస్తులు వేసుకుంటాం. కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంటాం. మరి జంతువులు ఏం చేస్తాయి? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అవి కూడా స్నానం చేస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? అవును.. మనుషుల్లాగే ఇతర జీవులు కూడా స్నానం చేసి శుభ్రంగా ఉంటాయి. తాజాగా అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రెండు రామ చిలుకలు ఒకదాని తరువాత ఒకటి స్నానం చేస్తూ సరదాగా జలకాలాడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది.

ఈ వీడియోలో ఓ చెట్టుకు ఉన్న బొరియలో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఆ నీటి వద్దకు రెండు రామ చిలుకలు వచ్చాయి. ఇంతలో ఓ చిలుక ఆ నీటిలో దిగి హాయిగా స్నానం చేసేంది. దాని పని అయిపోగానే మరో చిలుక ఎంటరైంది. అది కూడా హాయిగా స్నానం చేసింది. బాత్ మాదిరిగా ఉన్న గుంటలో.. ఈ రెండు చిలుకలు సరదాగా స్నానమాడాయి. అయితే ఈ అందమైన సన్నివేశం అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ బ్యూటీఫుల్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ చిలుకు మనుషులకు ఏమాత్రం తీసిపోవంటూ కితాబిస్తున్నారు. వాటి తెలివికి హ్యాట్సాఫ్ చెబుతూ లైక్స్ మీద లైక్స్ కొట్టేస్తున్నారు.

Also read:

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..