Viral Video: వలలో చిక్కుకున్న వింత చేప.. రెండు నోళ్లు.. నాలుగు కళ్లతో.. చూడగానే భయం పుట్టేలా..

|

Sep 21, 2022 | 7:15 PM

Weird Fish: ఒక వింత చేపకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఈ చేపకు రెండు నోళ్లు అలాగే నాలుగు కళ్లు ఉండడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: వలలో చిక్కుకున్న వింత చేప.. రెండు నోళ్లు.. నాలుగు కళ్లతో.. చూడగానే భయం పుట్టేలా..
Weird Fish
Follow us on

Weird Fish: భూమి లాగే సముద్రం కూడా ఎన్నో జీవజాతులకు నిలయం. ఎన్నో రకాల జంతువులు సముద్రంలో ఆశ్రయం పొందుతున్నాయి. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలా డేంజరస్‌ సీ యానిమల్స్‌ జాబితాలో చేపలు కూడా ఉన్నాయి. అందులోనూ షార్క్ , స్టోన్ ఫిష్, క్యాట్ ఫిష్, పఫర్ ఫిష్ మరియు పిరానా చేపలు మరీ ప్రమాదకరం. ఎంతో బలంగా ఉండే ఈ సముద్రపు చేపలు చిన్న జీవాలను క్షణాల్లో వెంటాడి ఆహారంగా మార్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక వింత చేపకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఈ చేపకు రెండు నోళ్లు అలాగే నాలుగు కళ్లు ఉండడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ప్రకృతి అద్భుతంగా అభివర్ణిస్తే, మరికొందరు చెర్నోబిల్ అణు కర్మాగారం దుర్ఘటన రేడియేషన్ బాధితురాలిగా పేర్కొంటున్నారు. అదే సమయంలో, చేప రెండో నోటిని దాని ముక్కుగా చెబుతున్నారు. అయితే ఈ వింత చేపపై శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి స్పందన లేదు .

కాగా ఈ వింత చేప నోరే కాదు కళ్లు కూడా వింతగా ఉన్నాయి. కళ్లు కొంచెం నీలిరంగులో కనిపిస్తున్నాయి. చేపకు రెండు నోళ్లు ఉండటంతో శాస్త్రవేత్తలు సైతం దీనిపై ఏం చెప్పలేకపోతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. ఈ వీడియోను @closecalls7 హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. హోలీ మదర్ ఆఫ్ కార్ప్ అని క్యాప్షన్‌ను జోడించారు. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 2.2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 5 వేలకు పైగా లైక్స్, వందల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..