ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడు, ఏ విషయాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. సోషల్ మీడియా పేజీలో ఇప్పుడు రీల్స్, వైరల్ వీడియోలు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని ఇష్టంగా చూసేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వీడియోలు చూస్తున్న సమయంలో ఎవరూ ఊహించని వీడియో కనిపించింది. ఈ వీడియో చూసిన వారు ఒక్కోసారిగా స్టన్ అయిపోతారు. అసలు ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తారు. ఇది చూసిన తర్వాత నవ్వుతారు కూడా .. అసలు ఇలాంటి పనులు ఎలా చేస్తారు? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అని కూడా అంటారు.
అడవిలో ప్రమాద కరమైన జంతువుల్లో సింహం, పులి, ఎలుగుబంటి, చిరుత పులి వంటివి గుర్తుకొస్తాయి. ఇవి జంతువులకు, మానవులకు కూడా ప్రమాదకరమైన జంతువులు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి.. పులిని నియంత్రించి తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో కాస్త భిన్నంగా ఉంది. పులి అతని పెంపుడు జంతువుగా అనిపిస్తుంది. ఈ వైరల్ అవుతున్న ఈ వీడియో బీహార్‌కు చెందినదని. ఇద్దరు వ్యక్తులు ఏనుగుపై కూర్చొని పులిని తమతో పాటు కూర్చోబెట్టుకుని షికారు చేస్తున్నారు.
इ बिहार है बाबू यहां उड़ती चिड़िया को भी हल्दी लगा देते हैं!
ऐसे अदभुद नजारे बिहार में ही देखने को मिल सकते है!😂 pic.twitter.com/Y91mivfpwS
— गुरु (@guru_ji_ayodhya) December 24, 2024
ఏనుగుపై ఇద్దరు వ్యక్తులు కూర్చోవడం, వారితో పాటు ఓ పులి కూడా ఆనందంగా కూర్చోవడం వీడియోలో కనిపిస్తోంది. అందులో ఒకరు జనాల ముందు తాను హీరో అయ్యాడంటూ టైగర్‌ని వేధించడం కనిపిస్తే, ఒక్కోసారి టైగర్ చెవులను పట్టుకుని గట్టిగా తిప్పుతున్నాడు. అసలు అది పులా పెంపుడు పిల్లా అన్నట్లు కూర్చుని ఉంది.
@guru_ji_ayodhya అనే ఖాతా ద్వారా Xలో వీడియో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటి వరకూ దీనిని ఐదు లక్షల మందికి పైగా చూసి, కామెంట్స్ చేస్తూ తమ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వ్యక్తులు చాలా ప్రమాదకరం అని ఒక వినియోగదారు రాశారు. మరొకరు ‘అటవీ శాఖ వారే అయి ఉండాలి.. లేకుంటే సామాన్యులెవరికీ ఇలా చేసే ధైర్యం ఉండదు’ అని రాశారు. మరో వినియోగదారు, ‘ఈ వీడియో బీహార్‌కి చెందినది కాదు.. కార్బెట్ పార్క్ రామ్‌నగర్‌లోనిది. ఈ పులిని అటవీ శాఖ పట్టుకుంది’ అని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..