Viral Video: రెండు ఎలుగుబంట్లు కొట్టుకుంటే ఎట్టుంటుందో తెలుసా.? షాకింగ్ వీడియో మీకోసమే!

|

Nov 19, 2021 | 7:23 PM

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా అడవిలోని జంతువులకు సంబంధించిన...

Viral Video: రెండు ఎలుగుబంట్లు కొట్టుకుంటే ఎట్టుంటుందో తెలుసా.? షాకింగ్ వీడియో మీకోసమే!
Bears
Follow us on

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.

వైరల్ వీడియో ప్రకారం.. రెండు ఎలుగుబంట్లు ఒకదానితో ఒకటి భీకర యుద్దానికి దిగడం మీరు చూడవచ్చు. రెండూ విరుచుకుపడ్డాయి. పోటపడి మరీ కొట్టుకున్నాయి. మధ్యలో కాసేపు శాంతించినా.. వాటి మధ్య మాత్రం ఫైట్ ఆగలేదు. కారణం తెలియదు గానీ ఈ రెండు ఎలుగుబంట్లు మాత్రం ఓ కుస్తీలు పడ్డాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘nature27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేసింది. ఇప్పటిదాకా దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అలాగే 3.2 వేల లైకులు రాబట్టింది. ‘ఇవి ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయా.?’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌ను తలపిస్తోంది’ అని వేరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.