Video Viral: సైన్స్ ల్యాబ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చిన తాబేలు.. ఆ తర్వాత ఏం చేసిందంటే..

ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే జంతువు తాబేలు.. తాబేలు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. చాలా మంది ఇళ్లలో

Video Viral: సైన్స్ ల్యాబ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చిన తాబేలు.. ఆ తర్వాత ఏం చేసిందంటే..
Viral
Follow us

|

Updated on: Nov 23, 2021 | 1:23 PM

ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే జంతువు తాబేలు.. తాబేలు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. చాలా మంది ఇళ్లలో తాబేళ్లను పెంచుకుంటారు. అలాగే ఇవి నీటిలోనూ జీవిస్తుంది.. భూమి మీద జీవిస్తుంది. ఇటీవల తాబేళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వీటి వీడియోలు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంటాయి. అలాగే కొన్ని నవ్వులు తెప్పిస్తాయి. ఇక ఈమధ్య కాలంలో ఇంటర్నెట్‏లో వైరల్ అవుతున్న వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగించినవి లేకపోలేదు. కానీ.. ఓ తాబేలు లేబొరేటరీని ప్రారంభించడం ఎప్పుడైనా చూశారా ? అది కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి లేబొరేటరీని ఘనంగా ప్రారంభిచడం. నమ్మడం కాస్త కష్టమే. కానీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఇదే.

ఆ వీడియోలో ఒక తాబేలు సైన్స్ లేబొరేటరీని ప్రారంభించింది. ఆకులు, కొమ్మలతో చేసిన రిబ్బన్‏లను కొరుకుతూ సైన్స్ లేబొరేటరీని ప్రారంభించింది తాబేలు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. 2015లోనే ఈ ఘటన జరిగింది. బీబీసీలో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం ఈ తాబేలు పేరు చార్లెస్ డార్విన్.. దీనిని చేతులతో పట్టుకున్న వ్యక్తి ప్రకృతి శాస్త్రవేత్త.. టీవీ యాంకర్ క్రిస్ ప్యాక్ హామ్. అతను ఆకులతో చేసిన రిబ్బన్లను తాబేలుతో కట్ చేయించి సైన్స్ ల్యాబ్ ప్రారంభించారు. ఇప్పుడు ఈ వీడియో మళ్లీ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  చలికాలంలో ఈ బ్రేక్‏పాస్ట్స్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అవేంటంటే.. 

Tirumala: తిరుమల గిరుల్లో అద్భుతం.. ఆకాశం నేలకు దిగి వచ్చిందా అన్నట్లు ప్రకృతి పరవశం..