AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు జరిగాయి.  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులతో కలిసి దీపాలు వెలిగించి పండుగ సంబరాల్లో భాగమయ్యారు. ఓ భారతీయ వ్యాపారవేత్త ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. అమెరికాలోని ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారతదేశం తరఫున అమెరికా రాయబారి వినయ్ క్వాత్రా, భారతీయ సంతతికి చెందిన  ప్రముఖులు  పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో భారతీయ పండుగను జరుపుకోవడం అక్కడి భారతీయ సమాజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!
Trump Lights Diya Participates In Diwali Celebration At White House
Sharada V
|

Updated on: Nov 07, 2026 | 8:55 AM

Share

ఈ వేడుకల్లో భారతీయ టెక్ వ్యాపారవేత్త, GOQii సంస్థ వ్యవస్థాపకుడు విశాల్ గోండాల్ ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. అనంతరం ట్రంప్‌తో కలిసి సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించారు. ఈ వివరాలను విశాల్ గోండాల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు. ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడితో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని, కోట్లాది మంది భక్తితో పఠించే తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని ట్రంప్‌కు అందించడం సంతోషంగా ఉందన్నారు.

ధైర్యం, భక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా హనుమాన్ చాలీసాను అభివర్ణించారు. దీపాలు వెలిగించే సమయంలో భారత్, అమెరికా మధ్య స్నేహబంధం మరింత బలపడాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించే విజయానికి దీపావళి ప్రతీక అని తెలిపారు. ఈ సందర్భంగా ‘జుగ్ జుగ్ జియో’ అనే భారతీయ ఆశీర్వాదాన్ని ప్రస్తావించారు. అంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని అర్థం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ శాంతి, సౌభాగ్యం, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

వైట్‌హౌస్‌లో దీపావళి ఎప్పటి నుంచి

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించే సంప్రదాయం ఇప్పటిది కాదు. 2003లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో వైట్‌హౌస్‌కు సమీపంలోని ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లో ఈ వేడుకలు జరిగేవి. భారతీయ అమెరికన్లు, భారత దౌత్యవేత్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మరో అడుగు ముందుకేసి వైట్‌హౌస్‌లోనే తొలిసారిగా దీపం వెలిగించారు. ఈస్ట్ రూమ్‌లో జరిగిన ఆ కార్యక్రమం ప్రత్యేక గుర్తింపు పొందింది. అప్పటి నుంచి వైట్‌హౌస్‌లోని వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఓవల్ ఆఫీస్, రూజ్‌వెల్ట్ రూమ్‌లలోనూ దీపాలు వెలిగించారు.

ప్రముఖుల సందడి

ఈసారి ట్రంప్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, కెనడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు రూబీ ధల్లా సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో జరగడం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహూకరించడం ఈ వేడుకల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి

Follow Us
వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!
వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!
17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..
17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..వారికి SHRC నోటీసులు
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..వారికి SHRC నోటీసులు
దీపావళి సంబరాల్లో టపాసులు కాల్చేటప్పుడు కళ్లను ఎలా కాపాడుకోవాలి?
దీపావళి సంబరాల్లో టపాసులు కాల్చేటప్పుడు కళ్లను ఎలా కాపాడుకోవాలి?
CID మెరుపు దాడులు.. ధరణి అక్రమాల కేసులో మరో ఐదుగురు అరెస్ట్
CID మెరుపు దాడులు.. ధరణి అక్రమాల కేసులో మరో ఐదుగురు అరెస్ట్
తొలి బుల్లెట్ రైలులో అద్బుత సౌకర్యాలు.. ఈ ఫీచర్లు చూస్తే అదుర్స్
తొలి బుల్లెట్ రైలులో అద్బుత సౌకర్యాలు.. ఈ ఫీచర్లు చూస్తే అదుర్స్
టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్న గిల్..!
టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్న గిల్..!
MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం.. రిజల్ట్స్ లైవ్ వీడియో
MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం.. రిజల్ట్స్ లైవ్ వీడియో
అమ్మవారికి భక్తుడి విచిత్ర కోరిక.. చీటిలో ఏం రాశాడో చూడండి..
అమ్మవారికి భక్తుడి విచిత్ర కోరిక.. చీటిలో ఏం రాశాడో చూడండి..
UPSC సివిల్స్ ఇంటర్వ్యూకు 2,526 మంది ఎంపిక.. పూర్తి వివరాలివే
UPSC సివిల్స్ ఇంటర్వ్యూకు 2,526 మంది ఎంపిక.. పూర్తి వివరాలివే