Watch: ఆటగదరా శివ.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

దేశంలో ఆకస్మిక మరణాలు ఆగడం లేదు. ప్రతి నిత్యం ఎవరో ఒకరు ఆకస్మికంగా మరణించడం అందరినీ కలవరపెడుతోంది. యువకుల నుంచి వృద్ధుల వరకు ఇప్పటికే ఎంతోమంది ఇలా చనిపోయారు. తాజాగా ఓ మహిళ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.

Watch: ఆటగదరా శివ.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Woman Dies While Dancing

Updated on: Aug 20, 2025 | 7:23 PM

గత కొంతకాలంగా ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువకుల నుంచి పెద్దల వరకు ఉన్నట్లుండి కుప్పకూల మరణిస్తుండడం కలవరపెడుతోంది. క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు, డ్యాన్స్ చేస్తూ మరొకరు.. ఇలా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ మహిళ పెళ్లి వేడుకలో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది. ఈ ఘటన చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో చోటుచేసుకుంది. మరణించిన మహిళను కాంచీపురంకు చెందిన జీవాగా గుర్తించారు.

జీవా తన భర్తతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు వెల్మురుగన్ వేదికపై పాటలు పాడుతూ, అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ క్రమంలో జీవా వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇతర బంధువులు సైతం డ్యాన్స్‌లో మునిగిపోయారు. ఇంతలో జీవా ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. బంధువులు ఎంత ట్రై చేసిన ఆమె లేవకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీతో ఆనందంతో నిండిన వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన మొత్తం అక్కడ ఉన్న ప్రేక్షకులు కెమెరాలో రికార్డు చేశారు.

జీవా భర్త చెన్నైలో ఒక ప్రసిద్ధ మెడికల్ షాప్ నడుపుతున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకరు ఎంబీబీఎస్, మరొకరు ఫార్మసీ చదువుతున్నారు. పెళ్లి వేడుకకు వెళ్లి ఆనందంగా గడిపే క్రమంలో ఇలా జరగడం ఆమె కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us