Viral Video: టోల్‌ప్లాజా వద్ద పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. ఇంతకీ కారణం ఏంటంటే..

| Edited By: Rajeev Rayala

Sep 16, 2022 | 6:31 AM

Viral Video: సాధారణంగా మహిళలు కొట్టుకోవడం నీటి కుళాయిల వద్ద ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే క్యూలైన్ల విషయంలో వచ్చే చిన్న వివాదం..

Viral Video: టోల్‌ప్లాజా వద్ద పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. ఇంతకీ కారణం ఏంటంటే..
Women Fighting
Follow us on

Viral Video: సాధారణంగా మహిళలు కొట్టుకోవడం నీటి కుళాయిల వద్ద ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే క్యూలైన్ల విషయంలో వచ్చే చిన్న వివాదం.. భౌతిక దాడుల వరకు వెళ్తుంది. అయితే, తాజాగా షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. మరి ఆ మహిళలు ఎవరు? ఎక్కడ కొట్టుకున్నారు? ఎందుకు కొట్టుకున్నారు? అనే వివరాలు చూద్దాం..

మహారాష్ట్ర లోని నాసిక్‌ టోల్‌ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల సిగపట్టు పట్టారు. వీరి సిగపట్లకు సంబంధించిన వీడియో సంచలనం రేపింది. టోల్‌ ఫీజు చెల్లింపుపై మహిళా ఉద్యోగితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. పరస్పరం ఇద్దరు దాడులు చేసుకున్నారు. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ భార్య టోల్‌ ప్లాజా ఉద్యోగితో గొడవ పడ్డారు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అక్కడే ఉన్నాడు. ఇద్దరు మహిళలను విడిపించడానికి స్థానికులు నానాతంటాలు పడ్డారు. అయితే, వీరిద్దరూ కొట్టుకుంటుండగా.. కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..