
వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కొంగ జాతికి చెందిన ‘ఎగ్రెట్స్’ అనే పక్షి ఒక పెద్ద చేపను వేటాడే దృశ్యం రికార్డైంది. సాధారణంగా చిన్న చేపలను తన పొడవాటి ముక్కుతో చిటికెలో పట్టేసుకునే ఈ పక్షి, ఈసారి మాత్రం అంతకుమించిన సాహసానికి పూనుకుంది. తన ముక్కుతో చేప శరీరంలోని పక్క రెక్కలను మాత్రమే పట్టుకుని, దాన్ని నీటి నుంచి పైకి లాగడానికి విశ్వప్రయత్నం చేసింది. చేప బరువు ఎక్కువ కావడంతో, కొంగ దాన్ని గాలిలోకి ఎత్తలేకపోయింది. అయినప్పటికీ, తన వేటను వదులుకోవడానికి పక్షి సిద్ధంగా లేదు. చేప ప్రాణాల కోసం విలవిలలాడుతుంటే, కొంగ దాన్ని గట్టిగా పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
కొన్ని నిమిషాల పాటు చేపను నీటిలోనే లాగుతూ, గట్టుకు చేర్చడానికి పక్షి తీవ్రంగా శ్రమించింది. భారీ చేప బరువుకు కొంగ రెక్కలు అదురుతున్నా, తన పట్టును వదులుకోలేదు. చివరకు, ఎలాగోలా చేపను ఒడ్డుకు లాక్కెళ్లింది. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది! తన ముక్కుతో కేవలం రెక్కలను మాత్రమే పట్టుకున్నందున, చేపను పూర్తిగా నియంత్రించలేకపోయింది. గట్టుకు చేర్చిన వెంటనే, చేప ఒక్కసారిగా పెద్దగా కదిలి, కొంగ ముక్కు నుండి జారి నీటిలోకి దూకి మాయమైపోయింది.
ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు, కొంత నిరాశకు కూడా గురయ్యారు. కొంగ పడిన శ్రమను చూసి జాలి పడినవారు కొందరైతే, చేప తప్పించుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన వారు ఇంకొందరు. ఈ వీడియో ప్రకృతిలోని జీవన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిందని, పక్షుల వేట నైపుణ్యాలు, వాటి పట్టుదల అద్భుతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అరుదైన, ఉత్కంఠభరితమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ, వేలాది లైకులు, కామెంట్లు అందుకుంటోంది.