Viral Video: బాలుడి ప్రతిభ అసాధారణం.. పాట విని మైమరిచిపోతున్న నెటిజనం.. వీడియో వైరల్

|

Feb 02, 2022 | 12:05 PM

Child Song Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తుంటాయి.

Viral Video: బాలుడి ప్రతిభ అసాధారణం.. పాట విని మైమరిచిపోతున్న నెటిజనం.. వీడియో వైరల్
Child Song Viral Video
Follow us on

Child Song Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి వైరల్ వీడియోల ద్వారా.. చాలామంది ప్రతిభావంతులైన వ్యక్తులు కూడా పరిచయం అవుతుంటారు. వారిలో దాగున్న కళలను చూసి సోషల్ మీడియా యూజర్స్ సహా అందరూ ప్రశంసిస్తుంటారు. చాలా మంది సింగర్స్ కూడా సోషల్ మీడియా (Social Media) ద్వారానే పరిచమైన వార్తలను చాలానే చూశాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న చోటూ సింగర్ (చిన్నారి గాయకుడు) ( Viral Video) వీడియో చూసి అమెజింగ్ అంటూ కితాబిస్తున్నారు. చిన్నారి స్వరం చాలా మధురంగా ​​ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అయిన వీడియోలో.. ఒక బాలుడు రాజస్థానీ పాటను చాలా మధురమైన వాయిస్‌తో పాడుతున్నట్లు చూడవచ్చు. పిల్లవాడి స్వరం చాలా మధురంగా ​​ఉంది. వింటుంటే మనసును హత్తుకుంటోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో.. 


ఈ వైరల్ వీడియోను ఐఏఎస్ అధికారి దేవ్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా రాశారు. క్యాప్షన్‌లో.. ఇంత చిన్న వయస్సులో ఇంత అద్భుతమైన గానం. మన మార్వార్ జానపద కళాకారుడు.. అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన యూజర్లు అద్భుతం అంటూ కితాబిస్తున్నారు. లైక్ చేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: బ్యాగులో 300 పాములను తీసుకెళ్లి అడవిలో వదిలి పెట్టాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

Viral Video: అరెరే.. ఇదేంటయ్య పుష్పరాజ్.. శ్రీవల్లి పాటను ఇలా చేశావ్..