Viral Video: తగ్గేదెలే అంటున్న శునకం.. బ్యాండ్ వాయిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది..

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా వైరల్ అయ్యే వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే..

Viral Video: తగ్గేదెలే అంటున్న శునకం.. బ్యాండ్ వాయిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది..
Dog Viral Video

Updated on: Feb 16, 2022 | 8:16 AM

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా వైరల్ అయ్యే వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో చాలా వేగంగా వైరల్ (Viral Video) అయ్యింది. ఇది చూసిన తర్వాత మీరు నవ్వును ఆపుకోలేరు. వైరల్ వీడియో చూసిన తర్వాత.. ఇది సాధ్యమేనా అంటూ నోరెళ్లబెడతారు. నిజానికి సోషల్ మీడియాలో ఓ కుక్క బ్యాండ్ వాయిస్తూ కనిపిస్తుంది. అయితే.. శునకం అన్ని వాయిద్యాలను క్రమంగా ఉపయోగిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా (Social Media) నెటిజన్లు ఇది నిజంగా చాలా తెలివైన కుక్క అంటూ ప్రశంసిస్తూ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై జాతీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌతాలా కూడా కామెంట్ చేశారు. టామీ బ్యాండ్ వాలా అంటూ కామెంట్ చేశారు.

వైరల్ వీడియోలో.. శునకం బ్యాండ్‌లో ఉన్న అన్ని వాయిద్యాలను క్రమంగా వాయించడాన్ని చూడవచ్చు. దాని స్టైల్ చూస్తుంటే బ్యాండ్ వాయించడంలో ప్రొఫెషనల్‌ అనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. జంతు ప్రేమికులు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు.

వైరల్ వీడియో..

వైరల్ అవుతున్న ఈ వీడియోని @TheDeshBhakt అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 11 వేల మంది వీక్షించారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. శునకం తెలివికి ఫిదా అవుతున్నామంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: కచ్చా బాదం పాటకు చిందులేసిన బుల్లితెర యాంకర్.. వైరల్‌ అయిన వీడియో..

Viral Video: ఇంగ్లీష్‌లో ఇరగదీసిన బామ్మ.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ అయిన వీడియో