ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అడవుల్లో ఉండాల్సిన జీవులు జనావాసాల్లోకి వస్తున్నాయి. పాములు కూడా వరద తాకిడి కారణంగా గ్రామాల్లో, పట్టణాలలో దర్శనిమిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పాముల హల్‌చల్‌కి సంబంధించిన వార్తలు రోజూ ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి నిద్రిస్తుండగా అతని దుప్పటిలోకి పాము దూరింది. గాఢ నిద్రలో ఉన్న ఆ వ్యక్తి శరీరంపై ఏదో పాకుతున్నట్లు అనిపించి లేచి చూసి.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే తేరుకుని భయంతో వేగంగా పరుగులు తీశాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్ బాన్స్‌వాడ జిల్లాలో ఓ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోను దిగువన చూడండి.
ఎలుకను వెంటాడుతూ వచ్చిన పాము.. క్షణాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కుర్రాడు
ఒక్కో సారి మన కళ్ల ముందు జరిగిన ఘటనలు కూడా నమ్మశక్యంగా ఉండవు. అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. ఒక భయంకరమైన కోబ్రా బారి నుంచి ఒక కుర్రాడు తృటిలో తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే. ఒక బాలుడు వాళ్ల కిరాణ షాపులో తన స్మార్ట్ ఫోన్‌తో ఏదో టైమ్ పాస్ చేస్తున్నాడు.. అయితే అక్కడ ఉన్న టేబుల్‌పై కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాడు. ఇంతలో అతడికి పైనుంచి ఏదో శబ్ధం వినిపించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా హుటాహుటిన లేచి బయటకి పరిగెత్తాడు. ఆ కుర్రాడు లేచిన సెకండ్ల వ్యవధిలోనే ఒక ఎలుకను వెంటాడుతూ జెట్ స్పీడులో కోబ్రా అక్కడకు వచ్చింది. అతడు అక్కడ ఉన్నట్లయితే కచ్చితంగా పాము కాటేసింది. భూమి మీద గడ్డి గింజలు ఉండటంతో.. ప్రాణాలు దక్కాయి. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి.
जाको राखे साईंया मार सके ना कोय !
मध्यप्रदेश के रायसेन जिले का यह वीडियो जिसमे चूहे और साँप की दौड़ में बालक बाल बाल बचा। pic.twitter.com/HGoaXXOgg0
— हितानंद Hitanand (@HitanandSharma) September 10, 2021
Also Read: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము… కానీ చివరకు మాత్రం