Viral Video: చిరుతపులి, బ్లాక్ పాంథర్ మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదిరిపోతాయి..!

Viral Video: అడవిలో రకరకాల జంతువులు నివసిస్తుంటాయి. సింహం, పులి, చిరుతపులి, జాగ్వర్ సహా అనేక రకాల జంతువులు జీవిస్తుంటాయి. ఈ జంతువులన్నింటిలో

Viral Video: చిరుతపులి, బ్లాక్ పాంథర్ మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదిరిపోతాయి..!
Leopard

Updated on: Mar 20, 2022 | 8:00 AM

Viral Video: అడవిలో రకరకాల జంతువులు నివసిస్తుంటాయి. సింహం, పులి, చిరుతపులి, జాగ్వర్ సహా అనేక రకాల జంతువులు జీవిస్తుంటాయి. ఈ జంతువులన్నింటిలో కెల్ల అత్యంత ప్రమాదకరమైనవి సింహం, పులి, చిరుత పులిని పేర్కొంటారు. వీటి కంట మరే జంతువు పడినా అదే దాని చివరి రోజుగా పేర్కొనవచ్చు. ఈ క్రూర మృగాల దాడులకు సంబంధించిన ఎన్నో వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అవి అటాక్ చేస్తే.. అవతలి జంతువుకు భూమిపై నూకలు చెల్లినట్లే ఇక. ఇదిలాఉంటే.. సాధారణంగానే జంతువుల మధ్య పోట్లాటలు జరుగుతుంటాయి. మనుషులు ఎలాగైతే కోట్టుకుంటారో.. జంతువుల మధ్య కూడా అలాంటా పంచాయతీలే జరుగుతాయి. సజాతి జంతువులు, ఇతర జంతువులతోనూ పోరాటం సాగిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. రెండు చిరుత పులులు, ఒక జాగ్వార్ మధ్య భీకర పోరు జరిగింది. వీటి పోరాటానికి సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు హడలిపోతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ఈ వీడియోలో తొలుత ఒక జాగ్వార్(బ్లాక్ పాంథర్), చిరుత పులి రెండూ భీకరంగా పోట్లాడుకుంటున్నాయి. ఇంతలో జాగ్వార్ కొంత దూరం వెళ్లి అక్కడ ఉన్న మరో చిరుత పులిపై విరుచుకుపడింది. ఇలా రెండు చిరుత పులులతో జాగ్వార్ కొట్లాడింది. వీటి మధ్య పోరు అత్యంత భీకరంగా సాగింది. అయితే, దీనంతటినీ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు హడలిపోతున్నారు. క్రూర మృగాల మధ్య జరుగుతున్న భీకర పోరు అత్యంత భయంకరంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ రాగా, వేలాది లైక్స్ వచ్చాయి. నెటిజన్లు తమ తమ స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!

Loading...
Unable to load recommendations.
Follow Us