Viral: ‘ఇదిగోరా జాతిరత్నం’.. ద్వీపం అంటే ఏంటో రాయమంటే..?

|

Sep 13, 2024 | 4:55 PM

ఇచ్చిన ప్రశ్నకు సమాధానం తెలియక.. అలా అని ఏం రాయకుండా ఉండలేక.. తమకు తోచిన, తెలిసిన స్టోరీలు రాస్తారు కొందరు. ఆన్సర్ పేపర్స్ దిద్దేటప్పుడు వాటిని చూసిన టీచర్స్ స్టన్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌లో రాసిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral: ‘ఇదిగోరా జాతిరత్నం’.. ద్వీపం అంటే ఏంటో రాయమంటే..?
Student Funny Answer
Follow us on

చిన్నప్పుడు స్కూల్లో మన క్లాస్‌మేట్స్‌లో చాలామంది జాతిరత్నాలు ఉంటారు. వీళ్లు చేసే చిచోరా పనులకు అడ్డూ అదుపు ఉండదు. ప్రతి దాంట్లో వేలు పట్టి.. అల్లరి అల్లరి చేస్తారు. వీళ్ల మరో స్పెషాలిటీ ఏంటంటే.. పరీక్షా పేపర్‌లో ప్రశ్నలకు రాసే ఆన్సర్స్. తమ జవాబులు వచ్చినా, రాకపోయినా.. ఆన్సర్ షీట్స్ మాత్రం నింపేస్తారు. పేజీకి ఒక మార్కు పడ్డా.. పాస్ అవుతాం అనే ఉద్దేశంతో చెలరేగిపోతూ ఉంటారు. తమకు తెలిసిన సినిమా స్టోరీస్, తమకు తెలిసిన వంటకాల గురించి రాస్తారు. ఇంకొందరు ఆణిముత్యాలు ఉంటారు. వారు దుస్తుల ఎలా ఉతకాలి, చేపలు ఎలా పట్టాలి వంటి ప్రాసెస్ వివిరిస్తూ పేజీలకు పేజీలకు రాస్తూ ఉంటారు.

మీ పాఠశాలలో, కాలేజీలో ఇలాంటి చిత్రవిచిత్ర సమాధానాలు రాసి..  మీరూ లేదా మీ బడ్డీస్..  టీచర్‌కు దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి. ఆ ఘటనలు గుర్తుకువస్తే ఇప్పుడు సరదాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటి రోజులు గుర్తుకు వచ్చి కాస్త ఉద్వేగానికి కూడా లోనవుతూ ఉంటారు. తాజాగా మీ ముందుకు ఓ జాతిరత్నం రాసిన ఆన్సర్‌ను తీసుకొచ్చాం. ఇక్కడ ప్రశ్నాపత్రంలో ద్వీపం అంటే ఏంటని అడిగారు..? దాన్ని మనోడు దీపం అంటే ఏంటి అని ఊహించుకుని ఆన్సర్ రాశాడు. అతను రాసిన ఆన్సర్ ఏంటి అంటే.. “ఒక చీప్ లిక్కర్ సీసా తీసుకుని దాని మూతికి బొక్క పెట్టి..  ఆ తర్వాత ఒక బనియన్ గుడ్డ ముక్కను చింపి.. ఆ రంధ్రంలో అమర్చిన తర్వాత.. ఆ చీప్ లిక్కర్ సీసాలో కిరోసిన్ పోసి.. గుడ్డను అమర్చిన తర్వాత… సీసా మూతకి ఉన్న గుడ్డముక్కని వెలిగిస్తే.. అది భగ భగ మండుతుంది.. దీన్నే దీపము అంటారు.. దీనిని మన పూర్వికులు ద్వీపము అని పిలిచేవారు” అని రాసుకొచ్చాడు ఈ క్రియేటివ్ స్టూడెంట్.

ప్రస్తుతం ఇతగాడి ఆన్సర్ మీమ్ రూపంలో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. నెటిజన్స్ ఫన్నీ ఆన్సర్స్ పెడుతున్నారు. మా బాల్యాన్ని గుర్తుచేశావ్, మా ఫ్రెండ్ ఇలానే రాస్తే టీచర్ పిచ్చి కొట్టుడు కొట్టింది అంటూ తమ జీవితంలోని అనుభవాలను పంచుకుంటున్నారు. ఇంతకీ ద్వీపం అంటే… నిర్దిష్ట భూభాగానికి చుట్టూ అంటే నాలుగు వైపులా జలం/సముద్రం ఆవరించి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..