Viral: అతివేగం అనర్థదాయకం అనేది ఇందుకే.. వైరల్‌ అవుతోన్న వీడియో..

అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం ఇలా ఎన్నో ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. సీసీటీవీ కెమెరాలు, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో వేదికగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే..

Viral: అతివేగం అనర్థదాయకం అనేది ఇందుకే.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Viral Video

Updated on: Jan 16, 2024 | 7:55 PM

ప్రతీ రోజూ ప్రమాదాల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. ప్రమాదాల్లో కొన్ని ఎదుటి వ్యక్తుల తప్పుల వల్ల జరిగేవి అయితే, ఎక్కువ శాతం మాత్రం మనం చేసే పొరపాటుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా ప్రతీ రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.

అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం ఇలా ఎన్నో ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. సీసీటీవీ కెమెరాలు, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో వేదికగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఒకరు.

నిత్యం సమాజంలో జరిగే పలు రకాల అంశాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందు వరుసలో ఉండే సజ్జనార్‌ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. ఓ మహిళా తనతో పాటు మరో మహిళను వెంటపెట్టుకొని స్కూటీపై వెళ్తొంది.

సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో..

అయితే ఓ మలుపు దగ్గర అతివేగంతో రావడంతో అదుపుతప్పి గోడను ఢీకొట్టింది దీంతో వెనకాల కూర్చున మహిళ ఒక్కసారిగా గోడ బయట పడింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఇదే వీడియోనే షేర్‌ చేసిన సజ్జనార్‌.. ‘అతివేగం అనర్థదాయకం’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us