Viral Video: విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతున్న తాలిబాన్లు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

|

Sep 10, 2021 | 7:23 PM

Viral Video: ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత దేశంలో పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రతిరోజు ఘోరమైన వార్తలు వెలువడుతున్నాయి.

Viral Video: విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతున్న తాలిబాన్లు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Talibani
Follow us on

Viral Video: ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత దేశంలో పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రతిరోజు ఘోరమైన వార్తలు వెలువడుతున్నాయి. సాధారణ పౌరులు, మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా తాలిబాన్లకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసి జనాలు విపరీతంగా నవ్వుతున్నారు. ఈ వీడియోలో తాలిబాన్ ఫైటర్లు విమానం రెక్కకి ఊయల కట్టి ఊగుతుండటం మనం గమనించవచ్చు.

అయితే తాలిబన్లు ఊయల కట్టి ఊగుతున్న విమానం అమెరికాది. వాస్తవానికి అమెరికన్ సైనికులు తమ యుద్ధ విమానాలను తిరిగి వచ్చే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లోనే వదిలిపెట్టారు. ప్రస్తుతం ఆ విమానాలను తాలిబాన్లు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాలిబాన్లు ఇప్పుడు తమ జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవిస్తున్నారని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఈ సన్నివేశం చూడటానికి చాలా సరదాగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిజియాన్ జావో ఈ వీడియోను షేర్‌ చేస్తూ అమెరికాను ఎగతాళి చేశారు. అమెరికా యుద్ద యంత్రాలను తాలిబాన్లు బొమ్మలుగా మార్చారని కామెంట్ చేశారు. చైనా తాలిబాన్లకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం చైనా ఆఫ్ఘనిస్తాన్‌కు 31 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. కాబూల్‌లో తాలిబాన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇది మొదటి సాయం. పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇరాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు.

Afghan-Taliban: పంజ్‌షీర్‌లో కొనసాగుతున్న తాలిబన్ల నరమేధం.. కేర్‌ టేకర్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేష్‌ సోదరుడిని కాల్చివేత!

Vinayaka Chavithi:  విఘ్నాలు తొలగిపోవాలంటూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గణపతికి ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ

High Income Families: అధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో త్వరలో భారత్ మూడో స్థానంలోకి..