పిడిగుద్దులు..చిరిగిన టీషర్ట్‌.. విమానంలో భీకర ఫైట్

లండన్ నుంచి ఢాకా వెళ్తున్న ఫ్లైట్‌లో ఇద్దరు వ్యక్తులు చిన్న విషయానికే మాటల యుద్ధానికి దిగారు. అది కాస్తా తీవ్రమై ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ హడావుడిలో ఒకరి చొక్కా కూడా చిరిగిపోయింది. ఇది చూసిన తోటి ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీవ్రంగా భయపడ్డారు.

పిడిగుద్దులు..చిరిగిన టీషర్ట్‌.. విమానంలో భీకర ఫైట్
T Shirt Torn Punches Fly As Passengers Fight On Dhaka London Flight

Updated on: Sep 18, 2026 | 7:41 PM

బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు భౌతిక దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లండన్ నుంచి ఢాకా వెళ్తున్న ఫ్లైట్‌లో ఇద్దరు వ్యక్తులు చిన్న విషయానికే మాటల యుద్ధానికి దిగారు. అది కాస్తా తీవ్రమై ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ హడావుడిలో ఒకరి చొక్కా కూడా చిరిగిపోయింది. ఇది చూసిన తోటి ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడ్డారు. చివరకు విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు మధ్యలో వచ్చి వారిని విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. అయితే వీరు ఎందుకు కొట్లాడుకున్నారనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ అధికారి మహబూబుద్దీన్ అహ్మద్ వెల్లడించారు.

విమానంలో మహిళ వీరంగం – నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన

బాల్టిమోర్ నుంచి 160 మంది ప్రయాణికులతో మియామీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ హల్చల్ చేసింది. విమానం గాల్లో ఉండగానే ఆమె తన బట్టలు తీసేసి, గట్టిగా అరుస్తూ అటూ ఇటూ తిరిగింది. ఇది చూసి ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు, అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను బలవంతంగా సీట్లో కూర్చోబెట్టి పైలట్‌లకు సమాచారం ఇచ్చారు. విమానాన్ని వెనక్కి మళ్లించకుండా ప్రయాణాన్ని కొనసాగించి, మియామీ చేరుకున్న వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు. సెప్టెంబరు 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ మహిళ ఎందుకు అలా ప్రవర్తించిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ప్రయాణ సమయంలో ఇలాంటి వింత ప్రవర్తనతో తోటి ప్రయాణికులను తీవ్రంగా భయపెడుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

Us Passenger Duct Taped To Seat

ప్రయాణికుడిని టేప్‌తో సీటుకు కట్టేసిన సిబ్బంది!

ఇటీవల టెక్సాస్‌ నుంచి న్యూజెర్సీలోని నెవార్క్ కు ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర హంగామా సృష్టించాడు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరిన రెండు గంటల తర్వాత ప్రయాణికులంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో, అకస్మాత్తుగా ఆ వ్యక్తి పక్క సీటులో కూర్చున్న ప్రయాణికుడిపై ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడికి దిగాడు. దాంతో సదరు ప్రయాణికుడు గొడవ చేయకుండా, సీటు నుంచి కదలకుండా విమాన సిబ్బంది అతడి శరీరం, చేతుల చుట్టూ గట్టిగా డక్ట్ టేప్ చుట్టి కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. అతని చేతులను జిప్ టైస్‌తో కట్టేసి, ఆ తర్వాత అతను సీటు నుంచి కదలకుండా డక్ట్ టేప్‌తో గట్టిగా బిగించి కట్టేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us