ఏంటి.! టైటిల్ చూసి ఖంగుతిన్నారా.? అయితే స్టోరీ చదివిన తర్వాత మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఓ 20 ఏళ్ల యువకుడు క్షణిక సుఖం కోసం హస్త ప్రయోగం చేసుకుంటుండగా.. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అంతే.! అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. టెస్టులు చేసిన డాక్టర్లు అసలు విషయాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..
స్విట్జర్లాండ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు ఇంట్లో బెడ్‌పై హస్త ప్రయోగం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీనితో ఆ యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌కు తీసుకొచ్చినప్పుడే బాధిత యువకుడి ముఖం వాచిపోయినట్లు.. శ్వాస తీసుకుంటున్న ప్రతీసారి ఊపిరితిత్తుల నుంచి శబ్దాలు రావడాన్ని వైద్యులు గమనించారు. ఇక వైద్యులు అతడికి పలు టెస్టులు నిర్వహించగా.. న్యుమోమెడియాస్టినమ్ అనే అరుదైన వ్యాధితో సదరు యువకుడు బాధపడుతున్నట్లు గుర్తించారు. అతడు తరచూ హస్త ప్రయోగం చేయడం వల్ల.. ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయని.. గాలి గట్టిగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని డాక్టర్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో నుంచి గాలి లీక్ కావడం వల్ల.. శ్వాస బలంగా తీసుకున్న ప్రతీసారి శబ్దాలు వస్తున్నాయని డాక్టర్లు నిర్ధారించారు. అంతేకాకుండా బాధిత యువకుడు అస్తమాతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
కాగా, ‘అతడికి హైడోస్ ఆక్సిజన్, యాంటీ బయోటిక్స్ ఇచ్చాం. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. 20 ఏళ్ల యువకులు హస్త ప్రయోగం చేసే సమయంలో చాలా అరుదుగా ఇలాంటి సమస్య తలెత్తుతుందని వైద్యులు స్పష్టం చేశారు’. ఇక ఈ రేర్ కేసును రేడియాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు.