Viral: ఆకలి లేకపోవడం, కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. ఎక్స్-రే రిపోర్ట్ చూసి స్టన్ అయిన డాక్టర్లు

|

Sep 16, 2022 | 3:46 PM

కడుపులో భారీ సంఖ్యలో బ్యాటరీలు( సెల్సులు) ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు.. తొలుత సాధారణ పద్దతుల్లో వాటిని బయటకు తీసేందకు యత్నించారు. కానీ వర్కువుట్ అవ్వలేదు.

Viral: ఆకలి లేకపోవడం, కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. ఎక్స్-రే రిపోర్ట్ చూసి స్టన్ అయిన డాక్టర్లు
Batteries In Stomach
Follow us on

Trending: ఐర్లాండ్(Ireland) రాజధాని.. డబ్లిన్‌(Dublin)లో ఓ అరుదైన మెడికల్ సర్జరీ జరిగింది. సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌ సర్జన్లు 66 ఏళ్ల మహిళ కడుపు నుంచి 50 స్థూపాకార బ్యాటరీలను బయటకు తీశారు. కాగా ఆస్పత్రిలో జాయిన అయిన తర్వాత  డాక్టర్లు చెప్పిన సాధారణ పద్దతులను అనుసరించగా ఆమె కడుపు నుంచి ఐదు బ్యాటరీలు బయటకు వచ్చాయి. వీటితో కలిపి ఆమె మొత్తం 55 బ్యాటరీలను మిగింది. స్వీయ హాని కలిగించుకునేందుకే ఆమె ఇలా చేసిందని డాక్టర్లు తెలిపారు. ఐరిష్ మెడికల్ జర్నల్‌లో తాజాగా ఈ కేసు గురించి ప్రచురించారు. కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో రోగి ఆస్పత్రికి వచ్చింది. ఆమె సమస్యను విన్న డాక్టర్లు ఎక్స్-రే తీయగా.. పొత్తికడుపులో పదుల సంఖ్యలో బ్యాటరీలు కనిపించాయి. బ్యాటరీలకు ఎలాంటి చిల్లులు లేకపోవడంతో.. ఒక వారం పాటు సాంప్రదాయ పద్దతిలో వాటిని బయటకు తెప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వారం రోజుల వ్యవధిలో రోగి మోషన్ నుంచి 5 బ్యాటరీలు బయటకు వచ్చాయి. డాకర్ల కోర్సు ఫాలో అయినప్పటికీ AA,  AAA రకం బ్యాటరీలు ఆమె జీర్ణవ్యవస్థలోనే ఉండిపోయాయి. దీంతో ఆమె పొత్తి కడుపు నొప్పితో అల్లాడిపోయింది. ఆ ప్రాంతంలో వాపు ఉండటాన్ని కూడా డాకర్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి.. ఆమె కడుపు నుండి మొత్తం 46 బ్యాటరీలను రిమూవ్ చేశారు. ఈ క్రమంలోనే  పెద్దప్రేగులో ఉన్న మరో నాలుగు బ్యాటరీలు పురీషనాళంలో చిక్కుకున్నాయి. ఆనల్ రిట్రాక్టర్,  లాంగ్ ఫోర్సెప్స్ పద్దతుల్లో వాటిని కూడా తొలగించారు. ప్రస్తుతం రోగి కోలుకున్నట్లు డాక్టర్లు తెలిపారు. (Source)

Batteries

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి