Success Story: పట్టువదలని విక్రమార్కుడు ఇతను.. ఎంఎస్సీలో 23 సార్లు ఫెయిల్.. 56 ఏళ్ల వయసులో ఉత్తీర్ణత

|

Nov 28, 2023 | 4:02 PM

బారువా జబల్‌పూర్ నివాసి. తన కలను నిజం చేసుకోవడానికి జీవించాడని చెప్పడంలో తప్పు కాదు. ఎమ్మెస్సీ  పూర్తి చేయడానికి అతనికి 25 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు అతను గర్వంగా చెబుతున్నాడు తనకు MSc (మ్యాథ్స్) డిగ్రీ పట్టా ఉందని. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ బారువా 2021 సంవత్సరంలో MSc పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు, తన ఆనందానికి అవధులు లేవు. మూసి ఉన్న గదిలోనే ఆనందంతో గెంతుతూ తనను తాను అభినందించుకునే పరిస్థితి నెలకొంది.

Success Story: పట్టువదలని విక్రమార్కుడు ఇతను.. ఎంఎస్సీలో 23 సార్లు ఫెయిల్.. 56 ఏళ్ల వయసులో ఉత్తీర్ణత
security guard rajkaran baraua
Follow us on

సముద్రంలో ఎగసి పడే కెరటం కాదు నాకు ఆదర్శం.. పడి లేచే కెరటం నాకు ఆదర్శం అని కొందరు చెబుతారు. అంతేకాదు ఎన్ని కష్ట, నష్టాలు ఎదురైనా తమ లక్ష్యాన్ని చేరుకునే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందుకు సజీవ సాక్ష్యం నిలుస్తాడు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌కరణ్ బారువా. MSc డిగ్రీ పట్టాను తీసుకోవడానికి రాజ్ కరణ్ దాదాపు సగం జీవితాన్ని వృధా చేసుకున్నాడు. అయితే ధైర్యం కోల్పోలేదు. ఎమ్మెస్సీ చదువుతున్న సమయంలో..రాజ్ ను చాలామంది ఎగతాళి చేశారు. ఎవరు ఏమి అన్నా తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. తన లక్ష్యం సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓర్పుతో కష్టపడి చదువుకుంటూ ఎమ్మెఎస్సీ పట్టాను తీసుకున్నాడు. వరుసగా 23 సార్లు ఫెయిల్ అయిన తర్వాత రాజ్  చివరకు 56 సంవత్సరాల వయస్సులో పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

బారువా జబల్‌పూర్ నివాసి. తన కలను నిజం చేసుకోవడానికి జీవించాడని చెప్పడంలో తప్పు కాదు. ఎమ్మెస్సీ  పూర్తి చేయడానికి అతనికి 25 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు అతను గర్వంగా చెబుతున్నాడు తనకు MSc (మ్యాథ్స్) డిగ్రీ పట్టా ఉందని.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ బారువా 2021 సంవత్సరంలో MSc పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు, తన ఆనందానికి అవధులు లేవు. మూసి ఉన్న గదిలోనే ఆనందంతో గెంతుతూ తనను తాను అభినందించుకునే పరిస్థితి నెలకొంది. బారువా రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం నుండి గణితంలో MSc చేయడానికి నమోదు చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కలలపై దృష్టి కేంద్రీకరించిన: బారువా

1997లో తొలిసారిగా ఎంఎస్సీ పరీక్షకు హాజరై ఫెయిల్ అయ్యానని చెప్పాడు. తరువాత 10 సంవత్సరాల్లో ఐదు సబ్జెక్టులలో ఒక సబ్జెక్టులో మాత్రమే ఉత్తీర్ణత అయ్యాడు. అయితే ఎప్పుడూ ఆశని వదులుకోలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయం తాను ఎప్పుడూ పట్టించుకోలేదని తన కలను నెరవేర్చుకోవడంపైనే దృష్టి పెట్టానని చెప్పాడు రాజ్. చివరగా 2020లో బారువా మొదటి సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. రెండవ సంవత్సరం కూడా తర్వాతి సంవత్సరం అంటే 2021లో క్లియర్ చేశాడు.

మీడియా కథనాల ప్రకారం బారువా చదువుతో పాటు పని చేసేవాడు. అతను తన జీవనోపాధి కోసం ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా కూడా పనిచేశాడు. అంతేకాదు అతను డబుల్ షిఫ్టులలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు.  ప్రతినెలా 5 వేల రూపాయలు వచ్చేది. ఈ సమయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా రాజ్ తన సంకల్పాన్ని వదులుకోలేదు.

 గ్రాడ్యుయేషన్ పూర్తి

అతను 1993లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. దీనికి కూడా పెద్ద యుద్ధమే చేశాడు. పాత పుస్తకాలు కొనుక్కుని డిగ్రీ చదువుకున్నాడు. చాలా పుస్తకాలు స్క్రాప్ డీలర్ల నుండి కొనుక్కుని చదువుకున్నాడు. దీని తరువాత అతను తన మాస్టర్స్ డిగ్రీని కొనసాగించడం ప్రారంభించాడు. అయితే ఎమ్మెఎస్సీ పూర్తి చేయడానికి తన జీవితంలో సగం పడుతుందని అప్పుడు అతనికి తెలియదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..