Viral Pic: అమ్మ బాబోయ్.. వీడు మామూలోడు కాదు.. ఆన్సర్ పేపర్ చూస్తే నవ్వి నవ్వి కడుపు నొవ్వాల్సిందే..!

Viral Photo: స్కూళ్లు, కాలేజీల్లో రకరకాల విద్యార్థులు కనిపిస్తుంటారు. కొందరు కష్టపడి చదివే వాళ్లు ఉంటే.. మరికొందరు అస్సలు చదవని వారు ఉంటారు.

Viral Pic: అమ్మ బాబోయ్.. వీడు మామూలోడు కాదు.. ఆన్సర్ పేపర్ చూస్తే నవ్వి నవ్వి కడుపు నొవ్వాల్సిందే..!
Child

Updated on: Nov 07, 2021 | 6:36 PM

Viral Photo: స్కూళ్లు, కాలేజీల్లో రకరకాల విద్యార్థులు కనిపిస్తుంటారు. కొందరు కష్టపడి చదివే వాళ్లు ఉంటే.. మరికొందరు అస్సలు చదవని వారు ఉంటారు. ఇంకొందరు చదవకుండానే పాస్ కావాలనే ఉద్దేశ్యంతో సరికొత్త ప్రయోగాలు చేసే వారు కూడా ఉంటారు. ఇలాంటి విద్యార్థులు చేసే అల్లరే స్కూళ్లు, కాలేజీలలో ఎక్కువగా ఉంటుంది. వారు ఏం చేసినా చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా అలాంటి విద్యార్థికే సంబంధించిన ఓ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది చూస్తే వీడసము మామూలోడు కాదురా బాబూ అనుకుంటున్నారు. ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నలకు సదరు విద్యార్థి ఇచ్చిన సమాధానాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ రేంజ్‌లో తన సృజనాత్మకతను ప్రదర్శించేశాడు.

వైరల్ అవుతున్న ఫోటోలో, ఓ చాలా టాలెండ్‌గా, ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తు ఆ ఆన్సర్ షీట్‌కు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ జవాబు పత్రాన్ని కరెక్షన్ చేసిన ఉపాధ్యాయుడు సైతం ఆ ఆన్సర్ చూసి ఎంజాయ్ చేశాడు. సబ్జెక్ట్ పరంగా విద్యార్థిని ఫెయిల్‌గా డిసైడ్ చేసినప్పటికీ.. క్రియేటివిటీ పరంగా మాత్రం అతనికి A+ గ్రేడ్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ విద్యార్థి ఎగ్జామ్ పేపర్‌లో ఏం ఆన్సర్స్ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న: నెపోలియన్ ఏ యుద్ధంలో మరణించాడు?
సమాధానం: అతని చివరి యుద్ధంలో.
ప్రశ్న: స్వాతంత్ర్య ప్రకటనపై ఎక్కడ సంతకం చేయబడింది?
సమాధానం: పేజీ చివరిలో.
ప్రశ్న: రావి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?
సమాధానం: నది ఉన్న రాష్ట్రంలో
ప్రశ్న: విడాకులకు ప్రధాన కారణం ఏమిటి?
సమాధానం: వివాహం.

ఈ సూటి ప్రశ్నలకు ఇలాంటి ఫన్నీ సమాధానాలు రాయడం చూసి నవ్వు ఆపుకోలేకపోయారు సదరు ఉపాధ్యాయుడు. వెంటనే.. ఆ పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు సైతం ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అంటూ పంచ్‌లు పేలుస్తున్నారు. ఏం క్రియేటివిటీ సామీ అంటూ దండాలు పెట్టేస్తున్నారు. మరికొందరైతే.. ఇందులో తప్పేం లేదంటూ ఎగ్జామ్ రాసిన విద్యార్థికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Viral Pic:

Also read:

Money Earning: 50 పైసలతో లక్ష రూపాయలు సంపాదించొచ్చు.. అదెలాగో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Home Remedies for Stone Problems: కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్యలా? వీటి ద్వారా ఉపశమనం పొందండి..!

Urination Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా?.. ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..!