Viral: కారు బంపర్​లో ఇరుక్కున్న కుక్క.. చూసుకోకుండా 70 కిలోమీటర్ల ప్రయాణం.. ఆపై

|

Feb 04, 2023 | 3:34 PM

పుత్తూరులోని కబాకకు చెందిన దంపతులు సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా బల్ప వద్ద వారి కారు కుక్కను ఢీకొట్టింది. వారు వెంటనే కారును ఆపారు కానీ చుట్టుపక్కల కుక్క కనిపించలేదు.

Viral: కారు బంపర్​లో ఇరుక్కున్న కుక్క.. చూసుకోకుండా 70 కిలోమీటర్ల ప్రయాణం.. ఆపై
Dog Trapped inside car bumper
Follow us on

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ ఆసక్తికర ఇన్సిడెంట్ వెలుగుచూసింది. రోడ్డుపై ప్రయాణిస్తూ ఉండగా పుత్తూరు రోడ్డులోని బల్ప వద్ద కారు ప్రమాదవశాత్తూ ఓ కుక్కను ఢీకొట్టింది. ఆ సమయంలో కుక్క కారు బంపర్​లో ఇరుక్కుపోయింది. వెంటనే కారు దిగిన ఓనర్​.. చుట్టూ వెతగ్గా అతడికి ఏమీ కనిపించలేదు. కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుందని భావించి.. కారులో 70 కిలోమీటర్లు ప్రయాణించి తన ఊరికి వెళ్లాడు. ఇంటి వద్ద కార్ పార్క్ చేస్తుండగా బంపర్​లో కుక్క కనిపించడంతో అతను కంగుతిన్నాడు.

వెంటనే మెకానిక్‌ని పిలిపించి.. బంపర్​ విప్పించి కుక్కను బయటకు తీశాడు. కుక్కకు చిన్న గాయం కూడా కాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పుత్తూరు తాలూక కబాకకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి.. గురువారం తన కుటుంబంతో కలిసి టెంపుల్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..