భారతదేశంలో కొత్త కారు లేదా వాహనం కొనుగోలు చేస్తే పూజ చేస్తారు. భగవంతుని అనుగ్రహం కలగాలని వాహనాన్ని పూజిస్తారు. ఈ సంప్రదాయం హిందూ కుటుంబాల్లో సర్వసాధారణం. ఇప్పుడు దక్షిణ కొరియా అంబాసిడర్ హిందూ సంప్రదాయం ప్రకారం సరికొత్త హ్యుందాయ్ జెనెసిస్ జివి80 కారుకు స్వాగతం పలికారు. ఈ వీడియో X ఖాతాలో షేర్ చేశారు. దక్షిణ కొరియా రాయబారి కొత్త కారుకు చేసిన పూజ నెటిజన్లతో ప్రశంసలు అందుకుంది.
భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బాక్ కొత్త కారును పొందారు. ఇది అంబాసిడర్లకు ఇచ్చే అధికారిక కారు. కొత్త కారు డెలివరీ రోజున భారతీయ సంప్రదాయం ప్రకారం చాంగ్ జే బక్ పూజలు నిర్వహించారు. కారు ఎంబసీకి డెలివరీ చేయబడింది. దక్షిణ కొరియా రాయబార కార్యాలయ అధికారి చాంగ్ జే-బాక్ పూజారులను పూజల కోసం పిలిచారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. టెంకాయ పగలగొట్టి హారతి వెలిగించారు.. అనంతరం కొత్త కారుకు కుంకుమపూజలు చేశారు.
We are delighted to have a new Hyundai Genesis GV80 as the Ambassador’s official vehicle and held a Pooja ceremony wishing for good luck! Join our embassy’s new journey! pic.twitter.com/MV4htMjk1H
— Korean Embassy India (@RokEmbIndia) September 25, 2023
X ఖాతాలో తన ఆనందాన్ని పంచుకున్న దక్షిణ కొరియా ఎంబసీ అధికారి, కొత్త హ్యుందాయ్ జెనెసిస్ GV80 కారు మా ఎంబసీ కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ కొరియా రాయబార కార్యాలయ అధికారుల అధికారిక కారు. కారుకు పూజలు చేశారు. కొత్త ప్రయాణంలో కొత్త రథసారధి మనల్ని ఆశీర్వదించాలి అని చాంగ్ జే బక్ అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..