Adorable Love: తాను మరణిస్తూ పిల్లకు జన్మనిచ్చిన లేడీ.. ఆ లేడి పిల్లను పెంచుతున్న చిరుతలు

|

Oct 18, 2021 | 10:03 AM

Adorable Love: జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియా లో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. ఇక జంతువులకు..

Adorable Love: తాను మరణిస్తూ పిల్లకు జన్మనిచ్చిన లేడీ.. ఆ లేడి పిల్లను పెంచుతున్న చిరుతలు
Adorable Love
Follow us on

Adorable Love: జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియా లో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన కథనాలు ఎప్పుడూ మనసుని ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదు. అమ్మ ప్రేమలోని కమ్మదనం అనుభవించడానికి అవతార పురుషుడు కూడా మానవజన్మ ఎత్తాడు అని అంటారు.. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా సృష్టిలో తియ్యనైంది మాతృత్వం అనిపిస్తుంది. ఒకొక్కసారి ఈ అమ్మప్రేమ జాతి వైరాన్ని కూడా మరిపిస్తుందని అనేక సంఘటనలు చూసి తెలుసుకున్నాం. ఇక తన బిడ్డ ఆకలి తీర్చడానికి అమ్మ ఎప్పుడూ ముందుంటుంది. తాను తినడం మానేసి మరీ బిడ్డ ఆకలితీర్చేది అమ్మ.. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని చిరుతలు.. జాతి వైరాన్ని మరచి చిన్న లేడి పిల్లను అక్కున చేర్చుకున్నాయి. అమ్మగా మారి లేడికి ఆకలి తీరుస్తున్నాయి. రక్షణ ఇస్తున్నాయి.

నిజానికి ఒక గర్భంతో ఉన్న ఓ లేడిని కొన్ని చిరుతలు వేటాయి చంపాయి. అప్పుడే ఆ లేడి ఓ చిన్న లేడికి జన్మనిచ్చి తల్లి లేడీ మరణించింది. అయితే అప్పుడే పుట్టిన లేడి లేచి నిలబడలేకపోయింది.. అది చూసిన చిరుతుల మనసు కదిలించి నట్లుంది. ఆశ్చర్యం కలిగిస్తూ.. అప్పుడే పుట్టిన లేగ దూడను చిరుతలు చేరదీశాయి. ఆ బిడ్డకు ప్రేమను పంచాయి. చిరుతలతో కలిసి లేగ దూడ సంతోషంగా గడుపుతుంది.  చిరుత, లేడీ ఫోటోలు నేషనల్ జియో ఛానల్ షేర్  చేసింది. ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read: విమానాలను పక్షుల నుంచి రక్షించుకోవడానికి పందులకు ఉద్యోగం ఇచ్చిన అధికారులు ఎక్కడంటే..