వామ్మో ! మనుషుల్ని మించిపోతున్నాయి కోతులు ! వాటి తెలివితేటలు అన్నీఇన్నీ కావు. చైనాలో ఇలాగే ఓ కోతి..తన వింత చేష్టతో తన యజమానురాలినే షాక్ కి గురి చేసింది. ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని ఎంచక్కా ఆన్ లైన్ లో సరుకుల్ని ఆర్డర్ చేసింది. కనీవినీ ఎరుగని ఘటన ఇది ! ఈస్టర్న్ చైనాలోని ‘ చాంగ్ జౌ ‘ అనే ప్రావిన్స్ లో ఓ మహిళ ఓ కోతిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటోంది. అది ఉండగానే తన ఫోన్ లోగ్రాసరీ షాపునకు ఫోన్ చేసి వస్తువులను తెప్పించుకునేది. ఆ మర్కటం కూడా ఆ వైనాన్నిశ్రధ్దగా గమనించేదేమో ! ఈ మధ్య కిచెన్ లో ఆమె తన మొబైల్ మరచి అటు వెళ్ళగానే ఆ కోతి మొబైల్ తీసుకుని ఆమె ఆర్డర్ చేసినట్టుగానే,, అన్ని సరుకుల తాలూకు నెంబర్లను నొక్కి.. ఏమీ ఎరుగనట్టు కూర్చుంది. ఆ మహిళ తిరిగి కిచెన్ లోకి వఛ్చి.. తన ఫోన్ చూసి ఆశ్ఛర్యపోయింది. ఏ వస్తువులనైతే తను ఆర్డర్ చేస్తానో అవే అక్కడ కనిపించాయి. ఎవరిదీ పని అని సీసీటీవీ చూస్తే.. అసలు ‘ దొంగ ‘ ఎవరో తెలిసిపోయింది. ఆ ఫుటేజీలో ఈ కోతి మొబైల్ తీసుకుని చేసిన యవ్వారం చూసి ముక్కున వేలేసుకుంది. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తూ.. మా మంచి’ కోతమ్మ ‘ అంటూ మురిసిపోతోంది.