
వన్యప్రాణుల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అడవిలో జంతువుల జీవన విధానం, వాటి వేటకు సంబంధించిన వీడియోలను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు. కొన్నిసార్లు ఒక జంతువు మరొక జంతువును వేటాడటం లేదా కొన్నిసార్లు తన ప్రాణాలను కాపాడుకోవడానికి క్రూర జంతువుల నుండి తప్పించుకోవడానికి పారిపోయే చిన్న జంతువులు వంటివి కనిపిస్తాయి. అలాంటి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియోలో ఒక పాము అసాధారణ రీతిలో ఒక చేపను వేటాడటం కనిపిస్తుంది. పాములు ఈ విధంగా వేటాడటం చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఈ వీడియో అడవిలో ప్రవహిస్తున్న ఒక నదితో ప్రారంభమవుతుంది. అక్కడ ఒక పాము తాడుపై వేలాడుతూ నదిలో చేపను పట్టుకుంటుంది. చేపను వేటాడిన ఆ పాము ఏకంగా నదిలోకి దూకి మరీ ఆ చేపను తన నోటిలో పట్టుకుంటుంది. ఆశ్చర్యకరంగా, అది ప్రవహించే నీటిలో పడిపోయిన తరువాత కూడా చేపను వదలదు. పాము చేపలను వేటాడే విధానం నిజంగానే అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే పాములు ఈ విధంగా వేటడం గతంలో ఎప్పుడూ చూసి ఉండరు.
వీడియో ఇక్కడ చూడండి..
— Nature Chapter (@NatureChapter) January 24, 2026
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @NatureChapter అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేయబడింది. ఈ 31 సెకన్ల వీడియోను 554,000 సార్లు చూశారు. వందలాది మంది వివిధ రకాలుగా వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..