Viral Video: పాము చేసిన క్రిస్మస్ వేడుక చూడండి.. భళా! అనకుండా ఉండలేరు.. వీడియో వైరల్

|

Dec 28, 2021 | 2:07 PM

Snake Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఎన్నడూ చూడని

Viral Video: పాము చేసిన క్రిస్మస్ వేడుక చూడండి.. భళా! అనకుండా ఉండలేరు.. వీడియో వైరల్
Snake Video
Follow us on

Snake Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఎన్నడూ చూడని సన్నివేశాలను మనం వీటిద్వారా చూస్తుంటాం. వీటిని నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తూ తెగ ఇష్టపడుతుంటారు. సాధారణంగా మనం పామును చూడగానే జంకుతుంటాం.. ఇంకా దగ్గర చూస్తూ భయంతో పరుగుతు తీస్తాం. అయితే.. పాములు ఆడుకుంటున్న వీడియోను మీరెప్పుడైనా చూశారా..? అదికూడా శాంతాక్లాజ్ టోపి ధరించి పాము హల్‌చల్ చేస్తుంది. ఇది మీరు నమ్మడం లేదు కదా.. ఇది నిజం. అలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో చర్చనీయాంశంగా మారింది. అందులో ఒక పాము చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోంది. ప్రజలు ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు. దీంతోపాటు ఫన్నీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో పాము భిన్నమైన రూపంలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల ఈ క్లిప్‌లో.. పాము శాంటాక్లాజ్ టోపీ ధరించి పాము సరదాగా పాకుతూ కనిపించింది. అదే సమయంలో ఓ వ్యక్తి పామును వీడియో తీస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాము కూడా సరదాగా కెమెరాకు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. పామును చూస్తే.. నవ్వుతూ ఈ క్షణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

వైరల్ వీడియో..


పాము వీడియో ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతోంది. ఎప్పుడూ పామును చూసి షాకయ్యే.. నెటిజన్లు క్యూట్‌గా ఉందంటూ లైకులు, కామెంట్ల ద్వారా ప్రేమను కురిపిస్తున్నారు. దీంతోపాటు పాము వీడియోను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్ హాగ్ పేరుతో ఉన్న ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించి.. పలు కామెంట్లు చేస్తున్నారు. పాము క్యూట్‌గా ఉందంటూ.. కొందరు పేర్కొంటుంటే.. పాము ఎప్పుడూ ప్రమాదకరమేనని కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: ఏం ఎంజాయ్ చేస్తున్నార్రా బాబు.. లైఫ్‌ అంటే ఇలా ఉండాలి.. ఈ వీడియో చూస్తే మీరూ ఒప్పుకుంటారు..

Viral Video: చాలాకాలం తర్వాత సంరక్షకుడిని చూసి ఏనుగుల భావోద్వేగం.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో..