మహారాష్ట్ర వార్దాలో ఏడేళ్ల చిన్నారిని నాగుపాము కాటేసింది. 2 గంటల పాటు నాగుపాము.. చిన్నారి మెడకు చుట్టుకొనే ఉంది. చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి.. చెయ్యిపై కాటేసి పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్నేక్‌ను పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు యత్నించినా ఫలితం దక్కలేదు. అనంతరం బాలికను సేవాగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. చిన్నారి పేరు దివ్యానీ పద్మాకర్ గడ్కరీ. వార్దాలోని సేలు పట్టణం బోర్ఖేడీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి.
పాము కాటు నుంచి క్షణకాలంలో తప్పించుకున్న మహిళ
అమెరికాలోని టెక్సాస్‌లో నివసించే ఓ మహిళ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా వరండాలో పాము ఆమెకు ఎదురైంది. పక్కనే ఉన్న పూల కుండి నుంచి బయటకు వచ్చిన పాము.. ఆమె కాలిపై కాటు వేయబోయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మహిళ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తింది. ఆమె అరుపులకు పాము కూడా కంగారు పడినట్టుంది. వెంటనే ఆ పాము కూడా భయంతో పారిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఆ హీరోయిన్ ఫోన్ వాల్‌పేపర్‌గా నటసింహం బాలయ్య ఫొటో