షాకింగ్‌.. ఆ సంవత్సరం నుంచి మనుషులు 180 ఏళ్లు జీవిస్తారట..! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Jan 10, 2022 | 2:34 PM

Human Lifespans: ఆధునిక కాలంలో మనుషుల సగటు ఆయుష్షు చాలా తగ్గిపోయింది. ఒకప్పటి ప్రజలు చాలా మంది 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించారు.

షాకింగ్‌.. ఆ సంవత్సరం నుంచి మనుషులు 180 ఏళ్లు జీవిస్తారట..! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Human Lifespan
Follow us on

Human Lifespans: ఆధునిక కాలంలో మనుషుల సగటు ఆయుష్షు చాలా తగ్గిపోయింది. ఒకప్పటి ప్రజలు చాలా మంది 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించారు. కానీ నేడు మానవుని సగటు వయస్సు 60 నుంచి 65 సంవత్సరాలు మాత్రమే. అయితే మానవుల జీవిత కాలం పెంచేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక శాస్త్రవేత్త ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాడు. వచ్చే శతాబ్దం నుంచి అంటే 2100 సంవత్సరం నుంచి మానవులు 180 సంవత్సరాల వరకు జీవిస్తారని పేర్కొన్నాడు. అతనితో ఉండే మిగతా శాస్త్రవేత్తలు కూడా ఈ శతాబ్దం చివరి ప్రజలు 130 సంవత్సరాల వయస్సు బతుకుతారని అంచనా వేశారు.

ప్రస్తుతం మానవులు 70 నుంచి 80 సంవత్సరాలు బతకడం చాలా కష్టం. చాలా వరకు వారి కోరికలు తీరకుండానే తనువు చాలిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి 180 సంవత్సరాల వయస్సు వరకు జీవించినట్లయితే అతని నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి. కెనడాలోని హెచ్‌ఈసి మాంట్రియల్‌కు చెందిన ప్రొఫెసర్ లియో బెల్జిల్ 2100 సంవత్సరం నాటికి జీవించి ఉన్న అతి పెద్ద వ్యక్తి రికార్డును బద్దలు కొట్టగలరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కువ కాలం జీవించిన రికార్డు ఫ్రెంచ్ మహిళ జీన్ కాల్మెంట్ పేరిట ఉంది. ఆమె 1997లో 122 ఏళ్ల వయసులో మరణించింది.

లియో బెల్జిల్ మానవ జీవితానికి గరిష్ట పరిమితి లేదని చెబుతున్నాడు. అయితే వ్యక్తి వయస్సు పెరిగితే వైద్య సేవల అవసరం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాడు. మానవులు వృద్ధాప్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వివిధ రకాల చికిత్సలకు గురవుతారు. అంతేకాకుండా పెన్షన్లు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్దయ్యాక ఏ పని చేయలేడు తద్వారా అతనికి జీవనోపాధి కష్టంగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించినట్లయితే శరీరంలోని అనేక భాగాలు పనిచేయడం మానేస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి మోకాలు, తుంటి, కార్నియా, గుండె కవాటాలు మార్చవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్ బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది.

Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

Beauty Tips: హీటింగ్ టూల్స్ వల్ల జుట్టు పాడై పోయిందా..! ఇంట్లోనే నివారణ చర్యలు ప్రారంభించండి..

గుడ్‌న్యూస్‌..! టాటాకంపెనీ ఈ కార్లపై 85,000 వరకు తగ్గింపు అందిస్తోంది..