Viral: వలకు చిక్కిన భారీ టైగర్ షార్క్.. అది ఏమి వాంతి చేసిందో తెలిస్తే మీ గుండెలు గుభేల్

|

Sep 08, 2022 | 6:08 PM

తాజాగా బహామాస్‌లో ఓ షార్క్ దాడిలో ఓ అమెరికన్ మహిళ కరోలిన్ డిప్లాసిడో(58) మరణించింది. ఆమె పెన్సిల్వేనియా కళాశాల క్యాంపస్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేసేది.

Viral: వలకు చిక్కిన భారీ టైగర్ షార్క్.. అది ఏమి వాంతి చేసిందో తెలిస్తే మీ గుండెలు గుభేల్
Tiger Shark
Follow us on

హంఫ్రీ సిమన్స్ అనే వ్యక్తి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. అతడు బహామాస్ సముద్ర జలాల్లో స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అనూహ్య రీతిలో అతడి గాలానికి 12 అడుగుల పొడవైన భారీ టైగర్ షార్క్ చిక్కింది. దీంతో దాన్ని వదిలేయాలని డిసైడయ్యారు. ఈ క్రమంలో షార్క్ దవడకు ఉన్న గాలం హుక్‌ను కత్తిరించేందుకు వెళ్లగా.. అదే సమయంలో అది ఓ మనిషి పాదాన్ని వాంతి చేసింది. మోకాలి నుంచి ఆ శరీర భాగం చెక్కుచెదరకుండా ఉంది.  దీంతో వారంతా స్టన్ అయ్యారు. తేరుకోవడానికి 10 నిమిషాల సమయం పట్టింది.  లోపల మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని భయపడి  ఆ షార్క్‌ను నసావు తీరానికి తీసుకువచ్చారు. అనంతరం పదునైన కత్తులతో దాన్ని కడుపును చీల్చారు.  లోపల మనిషి శరీర భాగాలు చిధ్రమైపోయి కనిపించాయి. ఫోరెన్సిక్ ఎగ్జామినర్లు ఛిద్రమైన శరీర భాగాలపై DNA పరీక్షలను పూర్తి చేశారు.  కనీసం రెండు రోజుల క్రితం షార్క్ మనిషిని మింగి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. అయితే అది తిన్నప్పుడు మనిషి చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా అని వారు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. సెప్టెంబరు 4, 2010న ఈ ఘటన జరిగింది. కాగా ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు ఇద్దరు నావికులు తప్పిపోయినట్లు తేలింది. ఆ వ్యక్తి వేలిముద్రల ద్వారా మృతుడిని సీమాన్ జడ్సన్ న్యూటన్‌గా పోలీసులు గుర్తించారు.  స్నేహితుడు ఫ్రాంక్లిన్ బ్రౌన్‌తో కలిసి న్యూటన్ ఆగష్టు 29 న బోటింగ్ ట్రిప్ సమయంలో ఓడ ఇంజిన్ సమస్యతో అదృశ్యమయ్యారు.

తాజాగా బహామాస్‌లో ఓ షార్క్ దాడిలో ఓ అమెరికన్ మహిళ కరోలిన్ డిప్లాసిడో(58) మరణించింది. ఆమె పెన్సిల్వేనియా కళాశాల క్యాంపస్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేసేది. ఆమె మంగళవారం నస్సౌలో కుటుంబంతో కలిసి స్నార్కెలింగ్ చేస్తుండగా.. ఓ షార్క్ ఆమెను అటాక్ చేసింది. రెస్క్యూ టీమ్  కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. కరోలిన్ మిల్‌క్రీక్ టౌన్‌షిప్‌లో నివసించేవారు. భయానక దాడి జరిగినప్పుడు ఆమె తన కుటుంబంతో కలిసి బహామాస్‌లో హాలిడే ట్రిప్‌లో ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..