Viral Video: మాస్క్ పెట్టుకోవాలంటే ఇంత కష్టపడాలా?.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో.

| Edited By: Anil kumar poka

Feb 27, 2022 | 8:51 AM

కరోనా వైరస్ అడుగుపెట్టాక 'ఫేస్ మాస్క్' (Face Mask) అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. కొవిడ్‌ తీవ్రత తగ్గుతున్నా మహమ్మారి మన మధ్యనే ఉందని మరికొన్ని రోజుల పాటు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Viral Video: మాస్క్ పెట్టుకోవాలంటే ఇంత కష్టపడాలా?.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో.
Follow us on

కరోనా వైరస్ అడుగుపెట్టాక ‘ఫేస్ మాస్క్’ (Face Mask) అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. కొవిడ్‌ తీవ్రత తగ్గుతున్నా మహమ్మారి మన మధ్యనే ఉందని మరికొన్ని రోజుల పాటు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా రెండో వేవ్‌ లో వైరస్‌ ఉద్ధృతి చూసి మాస్క్ ధరించడం ఇష్టం లేనివాళ్లు కూడా భయపడి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించారు. కానీ కరోనా వచ్చి రెండేళ్లయినా కూడా ఇప్పటికీ మాస్క్ ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్లు ఉన్నారా? అని అంటే నమ్మడం కొంచెం కష్టమే. ఎందుకంటే అది మన జీవితంలో నితృకృత్యమైంది. అయితే ప్రజలకు జవాబుదారీగ ఉండాల్సిన ఓ పార్టీ కార్యకర్త మాస్క్‌ ఎలా ధరించాలో తెలియక తెగ ఇబ్బంది పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు అతడిని చూసి తెగ నవ్వుకుంటున్నారు.

ముక్కు, చెవులు…

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. శివసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటోంది. అయితే తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తోన్న గోరఖ్‌పూర్‌లో శివసేన నేతలు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఓ బహిరంగ సభ కూడా ఏర్పాటుచేశారు. కాగా ఈ సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడుతుండగా అతని పక్కనే నిల్చున్న ఓ పార్టీ కార్యకర్త N-95 మాస్క్ ఎలా పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఓ సారి ముఖానికి ముక్కుపైకి పెట్టుకుని.. అది కరెక్ట్​ కాదేమోనని మళ్లీ వెనక్కి తీశారు. ఇక మాస్క్​ను ఎలా పెట్టుకోవాలో అని నానా రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చివరకు చెవులకు పెట్టుకున్నాడు. అయితే అది చెవులకు తగిలించుకునే మాస్క్ కాదని గ్రహించి.. మళ్లీ తీశాడు. ఇలా ఎంత సేపు ప్రయత్నించినా అర్థం కాకపోడంతో ముందున్న మరో కార్యకర్త సహాయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి చెప్పినట్లు చేసి ఎట్టకేలకు మాస్క్​ను సరిగ్గా పెట్టుకున్నాడు. కేవలం మాస్క్ పెట్టుకునేందుకు ఆ వ్యక్తి సుమారు రెండు నిమిషాలు సమయం తీసుకున్నాడు. ఎంపీ ప్రసంగమేమో కానీ.. మాస్క్ పెట్టుకునేందుకు పార్టీ కార్యకర్త చేసిన ప్రయత్నం మాత్రం ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. అందుకే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. నెటిజన్లతో నవ్వులు పూయిస్తోంది. ‘హమ్మయ్యా ఎట్టకేలకు సాధించాడు అంటూ. ప్రజలు పండగ చేసుకోవచ్చు’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read:IND vs SL: ధర్మశాల చరిత్ర మార్చిన రోహిత్ సేన.. లంకపై 7 వికెట్ల తేడాతో విజయం.. రాణించిన శ్రేయాస్, జడేజా, శాంసన్

Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..

Russia – Ukraine Conflict: నిర్మానుష్యంగా కీవ్ నగరం.. అక్కడి ప్రజలంతా ఎక్కడికి వెళ్లారంటే..