Viral Video: తగ్గేదేలే.! సింహంతో సెల్ఫీ.. కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్.. వైరల్ వీడియో!

|

Jan 24, 2022 | 6:58 PM

Viral Video: సింహం వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడవికి రాజైన సింహాన్ని(Lion) దూరం నుంచి చూస్తే చాలు మిగతా జంతువులు...

Viral Video: తగ్గేదేలే.! సింహంతో సెల్ఫీ.. కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్.. వైరల్ వీడియో!
Lion
Follow us on

సింహం వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడవికి రాజైన సింహాన్ని(Lion) దూరం నుంచి చూస్తే చాలు మిగతా జంతువులు ఠక్కున పారిపోతాయి. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చెట్లపైకి ఎక్కడం, పొదల్లో దాక్కోవడం లాంటివి చేస్తాయి. క్షణాల్లో తన పంజా విసిరి వేటాడే సామర్ధ్యం సింహం సొంతం. అంతటి బలశాలైన సింహంతో ఎవరైనా సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తారా.? ఏంటి.! సింహంతో సెల్ఫీనా.. ఇదేం పిచ్చి ప్రశ్న అనుకునేరు. నిజమండీ బాబు.. ఇక్కడొక వ్యక్తి సింహంతో సెల్ఫీ దిగాడు. అందుకు సంబంధించిన వీడియో(Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక మీరూ ఆ వీడియో చూస్తే ఏ గుండెరా.! వీడిది అని అనక మానరు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి చెట్టు దగ్గర కూర్చుని తన కెమెరాతో దూరంగా ఉన్న సింహాన్ని క్యాప్చర్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ వ్యక్తిని చూడగానే సింహం అతడి వైపుగా ముందుకు కదులుతూ వస్తుంది. ఇక దగ్గరకు రాగానే అతడిపైకి ఒక ఉదుటున దూకుతుంది. ఆ వ్యక్తి సింహం జూలు పట్టుకుని నిమరడంతో అది పెంపుడు జంతువు మాదిరిగా ప్రవర్తిస్తుంది. ఇలా సింహంతో ఆటలు ఆడిన ఆ వ్యక్తి ట్రైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.