ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదని చెబుతుంటారు. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా తమ అసమాన ప్రతిభతో అందరినీ మెప్పిస్తుంటారు. అయితే ఒకప్పుడు ఇలాంటి ప్రతిభావంతులు పెద్దగా ప్రపంచానికి తెలిసేవారు కాదు. అయితే సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత మారుమూల గ్రామాల్లో ఉన్న వారి ట్యాలెంట్ కూడా ప్రపంచానికి తెలుస్తోంది. ప్రతీ రోజూ ఇలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆర్టసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సులో ఓ దివ్యాంగుడు ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో శ్రీ ఆంజనేయం సినిమాలో పాటను ఆలపించాడు. పాటకు అనుగుణంగా కాళ్లను, చేతులను ఆడిస్తూ సంగీతాన్ని సృష్టించాడు. ఇక ఆ గాణ మాధుర్యం వింటుంటే ఔరా అనాల్సిందే.
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024
దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియా కాస్త సజ్జనార్ కంట్లో పడింది. దీంతో వెంటనే ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన సజ్జనార్.. ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో.! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా!’ అంటూ రాసుకొచ్చారు. ఇక సినిమాల్లో పాట పాడే అవకాశం ఇవ్వండి అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణిని ట్యాగ్ చేశారు. మరి సజ్జనార్ చేసిన ఈ ట్వీట్‌పై కీరవాణి స్పందిస్తారో లేదో చూడాలి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..