రూ. 20 భేల్ పూరీతో బ్యాంక్ ఖాతా వివరాలు ఫ్రీ! వైరల్ అవుతున్న దిగ్భ్రాంతికరమైన పోస్ట్!

సాధారణంగా మనం రోడ్డు పక్కన దొరికే చాట్ లేదా భేల్ పూరీని కాగితాల్లో చుట్టి ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒక వీధి వ్యాపారి రూ. 20 భేల్ పూరీని ఫ్యాక్ చేసిన ఇచ్చిన కాగితం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకరి సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉన్న పాత బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఆహారాన్ని చుట్టి ఇచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

రూ. 20 భేల్ పూరీతో బ్యాంక్ ఖాతా వివరాలు ఫ్రీ! వైరల్ అవుతున్న దిగ్భ్రాంతికరమైన పోస్ట్!
Privacy And Hygiene A 'joke'

Updated on: May 24, 2026 | 1:19 PM

సాధారణంగా మనం రోడ్డు పక్కన దొరికే చాట్ లేదా భేల్ పూరీని కాగితాల్లో చుట్టి ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒక వీధి వ్యాపారి రూ. 20 భేల్ పూరీని ఫ్యాక్ చేసిన ఇచ్చిన కాగితం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకరి సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉన్న పాత బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఆహారాన్ని చుట్టి ఇచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో భారతదేశంలో డేటా గోప్యతపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వినియోగదారుడు సుధాన్షు అంభోరే షేర్ చేసిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. ఆయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండు పేజీల అకౌంట్ స్టేట్‌మెంట్‌లో చుట్టిన భేల్ పూరీ చిత్రాన్ని అప్‌లోడ్ చేశారు. ఆ పత్రంలో సదరు ఖాతాదారుని పేరు, అకౌంట్ నంబర్, పూర్తి లావాదేవీల చరిత్ర స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ, “భారతదేశంలో గోప్యత అనేది నిజంగా ఒక హాస్యాస్పదమైన విషయం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

ఈ ఒకే ఒక్క పోస్ట్ భారతదేశంలో పౌరులు ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సమస్యలను తెరపైకి తెచ్చింది. రహస్య బ్యాంకింగ్ సమాచారం ఇలా నడిరోడ్డుపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి పత్రాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఆర్థిక మోసాలకు దారితీసే ప్రమాదం ఉంది. మరొకటి ముద్రిత కాగితాలపై ఉండే రసాయన ఇంక్ ఆహారంలో కలవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. పైగా, ఈ పాత కాగితాలు ఎలుకలు, దుమ్ము లాంటి అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. “ఇక్కడ గోప్యతతో పాటు పరిశుభ్రత కూడా హాస్యాస్పదంగా మారింది” అని ఒకరు వ్యాఖ్యానించగా, “రసాయన సిరా ఉన్న కాగితంపై తినడం ప్రాణాంతకం” అని మరొకరు హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు సున్నితమైన పత్రాలను పారవేసే విధానంలో మనకున్న అవగాహనా లోపాన్ని తెలియజేస్తున్నాయి. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆధార్ కార్డు కాపీలు వంటి వ్యక్తిగత పత్రాలను పారవేసే ముందు వాటిని పూర్తిగా చించివేయడం లేదా ష్రెడర్ ద్వారా ముక్కలు చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు డేటా రక్షణపై, ఇటు ఆహార భద్రతపై ప్రజల్లో తగిన చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us