పూర్వం పెళ్లి అంటే.. ఓ పండుగలా చేసుకునేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. పాశ్చాత్య పోకడలు ఎక్కువ కావడంతో భారత సంస్కృతికి కొందరు బైబై చెప్పేశారు. పెళ్లికి ముందే అన్ని కానిచ్చేయడమే కాకుండా.. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ అంటూ పెళ్లికి కొత్త అర్ధాన్ని తీసుకొచ్చి.. మొత్తం మార్చేశారు. ఇక ఈ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్స్‌లో కొత్తదనం కోరుకుంటున్నారు చాలామంది. బురదలో దొర్లుతూ, చెట్లపైకి ఎక్కుతూ.. చెత్తలో పోజులిస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీయించుకుంటున్నాయి కొన్ని జంటలు. అయితే ఇంకొందరు ట్రెండ్ మార్చారు. పెళ్లికి ముందే ఫస్ట్ నైట్‌ను ప్రీ-వెడ్డింగ్ వీడియోలా తీసింది ఓ జంట. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం ఓ జంట పెళ్లికి ముందే ప్రీ ఫస్ట్ నైట్ ప్లాన్ చేసింది. ఫస్ట్ నైట్ రోజున అసలేం జరుగుతుందో చెబుతూ ఆ జంట వీడియోను షూట్ చేసింది. ఈ వీడియోలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సాంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లడం మీరు చూడవచ్చు. అలాగే ఈ వీడియోలో ఓ గదిని ఫస్ట్ నైట్ మాదిరిగా అలకరించినట్టు మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఇదేం పిచ్చిరా బాబూ అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
కొత్త ట్రెండ్..: ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్.. pic.twitter.com/sFANzr9T0k
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) July 28, 2024