
నేపాల్‌లో చోటుచేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో ఒక వివాహ వేడుకకు సంబంధించినది. అక్కడ ఒక ఆహ్వానం లేని అతిథి వచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా? ఆ అతిథి సాధారణ అతిథి కాదు, అడవి నుండి నేరుగా వచ్చిన ‘రైనో జీ’. ఇప్పుడు ఈ క్లిప్ చూసిన తర్వాత, నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. అలాంటి దృశ్యం నేపాల్‌లో మాత్రమే చూడగలమని చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఖడ్గమృగం భాయ్ సాబ్ చాలా ప్రశాంతంగా వివాహ వేడకకు పిలవని పేరంటంలా హాజరైంది. అయితే వివాహ మండపంలో ఎలాంటి విధ్వంసం సృష్టించలేదు. ఎటువంటి గందరగోళం సృష్టించలేదు. నేరుగా VIP తరహా ఎంట్రీ ఇచ్చి, కొంచెం అటు ఇటుగా తిరిగింది. ఆపై అడవి వైపు తిరిగి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వారందరికీ, తాను ఆ జంటను శీర్వదించడానికి వచ్చానని, వారిని ఇబ్బంది పెట్టడానికి కాదని చెబుతున్నట్లుగా ఉంది. ఈ ఘటన నేపాల్‌లోని చిట్వాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో తీసిన జనం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదీ కాస్తా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, పెద్ద ఖడ్గమృగం వివాహ వేదిక గేటులోకి ప్రవేశించింది. అదే సమయంలో, ఆ వేడుకకు హాజరైన అతిథులు ఈ అనామక అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. వారిలో కొందరు వెంటనే తమ మొబైల్ ఫోన్‌లను తీసి ఖడ్గమృగాన్ని రికార్డ్ చేయడం ప్రారంభించారు. మరికొందరు భయంతో పరుగులు తీశారు. కానీ, ఆ ఖడ్గమృగం మాత్రం ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
వీడియో చూడండి..
@nepalinlast24hr ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేసిన ఈ వీడియోపై కామెంట్ల వరద పారుతోంది. ఎవరో ఇది ససురల్ గెండా ఫూల్ తరహా క్షణం అని అన్నారు. మరొకరు దీనిని నిజమైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని రాశారు. అదే సమయంలో, ఒక వినియోగదారుడు అద్భుతమైన పని చేశాడు. అతను ఖడ్గమృగం గురించి ప్రస్తావిస్తూ, అతన్ని పిలవకపోయినా పర్వాలేదు, అతను ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడు. అంటూ రాసుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..